Asianet News TeluguAsianet News Telugu

బ్యాంకు చోరీ చేసిన బిహార్ ముఠా.. రూ. 5 కోట్ల విలువ చేసే బంగారం లూటీ: పోలీసులు

బిహార్‌కు చెందిన ఓ ముఠా మధ్యప్రదేశ్‌లో ఓ బ్యాంకు దొంగిలించారు. రూ. 5 కోట్ల విలువైన బంగారాన్ని చోరీ చేశారు. రూ. 3.5 లక్షల నగదును దొంగతనం చేశారు.
 

bihar gang robs madhya pradesh bank, gold worth rs 5 crore
Author
First Published Nov 27, 2022, 4:35 PM IST

భోపాల్: బిహార్‌కు చెందిన ఆరుగురు సభ్యుల ముఠా మధ్యప్రదేశ్‌లో ఓ బ్యాంకుకు కన్నం వేసింది. సుమారు రూ. 5 కోట్ల విలువైన బంగారాన్ని, రూ. 3.5 లక్షల నగదును చోరీ చేసింది. మధ్యప్రదేశ్‌లోని కాట్ని జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది.

వారు పెద్దగా చదువుకోలేదని కూడా తెలుస్తున్నది. ఆ ఆరుగురు దొంగలు చేతిలో ఆయుధాలు పట్టుకుని మోటార్ బైక్‌పై వచ్చారు. గన్‌లతో బ్యాంకులోకి చొరబడి సిబ్బందికి గురిపెట్టారు. అందులో నుంచి బంగారం, నగదును చోరీ చేసినట్టు కాట్ని ఎస్పీ ఎస్ కే జైన్ వివరించారు. ఆ బ్యాంకు బార్గవాన్ ఏరియాలో ఉన్నదని తెలిపారు. అయితే, ఆ బ్యాంకు సరైన సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ లేదని వివరించారు.

బ్యాంకు అధికారుల ప్రకారం, ఆ దొంగలు రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు బంగారం దొంగిలించినట్టు వివరించారు. రూ. 3.5 లక్షల నగదును చోరీ చేసినట్టు తెలిపారు. రూ. 16 కిలోల బంగారం లేదా సుమారు రూ. 8 కోట్ల విలువైన బంగారాన్ని దొంగిలించినట్టు కొన్ని కథనాలు వస్తున్నాయని పోలీసులతో ప్రస్తావించారు. బ్యాంకు అధికారులు ఆ బంగారం బరువును ధ్రువీకరించలేదని తెలిపారు.

Also Read: ట్రైన్ ఇంజిన్లు, బ్రిడ్జీలను దొంగిలిస్తున్న బిహార్ చోరులు.. పక్కా ప్లాన్‌తో దొంగతనాలు

దొంగలు అందరు 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులు అని ఎస్పీ ఎస్ కే జైన్ తెలిపారు. వారంతా బిహార్‌కు చెందినవారని వివరించారు. ఈ గ్యాంగ్‌కు ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో నేరపూరిత రికార్డు ఉన్నదని పేర్కొన్నారు. నిందితులంతా నిరక్షరాస్యులని తెలిపారు. వారిని అరెస్టు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios