బిహార్ వర్షాలు.. అక్వేరియంగా మారిన ఆసుపత్రి.. రోగుల మధ్య చేపల షికారు

bihar floods: nalanda medical college turned as aquarium
Highlights

భారీ వర్షాలు బిహార్‌ను గజగజలాడిస్తున్నాయి. వాగులు, వంకలు ఏకమవ్వడంతో రాజధాని పాట్నా ముంపునకు గురైంది. భారీ భవంతుల్లోకి సైతం వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక నగరంలోని ప్రఖ్యాత నలంద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ను వరద ముంచెత్తింది. 

భారీ వర్షాలు బిహార్‌ను గజగజలాడిస్తున్నాయి. వాగులు, వంకలు ఏకమవ్వడంతో రాజధాని పాట్నా ముంపునకు గురైంది. భారీ భవంతుల్లోకి సైతం వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక నగరంలోని ప్రఖ్యాత నలంద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ను వరద ముంచెత్తింది. కింద ఉన్న జనరల్ వార్డుతో పాటు.. ఐసీయూలోకి భారీగా నీరు చేరుకుంది. నీటితో పాటు పెద్ద పెద్ద చేపలు కూడా రావడంతో పేషేంట్లు ఆందోళనకు గురయ్యారు. దీంతో రోగులు బెడ్ల మీద కాళ్లు పెట్టేసి.. చేపలకు ఆహార పదార్థాలు వేస్తూ కాలం గడుపుతున్నారు.

అయితే వ్యర్థ నీరు రావడంతో ఐసీయూలో ఉన్న రోగులకు ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు చేపలతో పాటు విష సర్పాలు, ఇతర కీటకాలు వస్తే తమ పరిస్థితేంటని రోగులు వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన నీటిని బయటకు పంపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం నలంద మెడికల్ కాలేజ్‌‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్వేరియంగా మారిన ఆసుపత్రి అంటూ కొందరు నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.

loader