Bihar Elections: బిహార్ ఎన్నికల్లో తొలి దశ ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరిగినా ఈసారి ఎన్నికల్లో బిహార్ ఓటర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు.
సాయంత్రం 5 గంటలకే 60.13% పోలింగ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించారు. నవంబర్ 6న 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగగా, సాయంత్రం 5 గంటల వరకే 60.13 శాతం ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గాల్లో 55.81% మాత్రమే ఓట్లు పడటం గమనార్హం.
గత ఎన్నికలతో పోల్చితే పెరిగిన ఓటింగ్ శాతం
2020లో జరిగిన ఎన్నికల్లో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 58.7% ఓటింగ్ నమోదైంది. 2015లో అయితే 56.9% ఓటర్లు మాత్రమే ఓటేశారు. కానీ ఈసారి మొదటి దశలోనే రికార్డు స్థాయిలో ఓటింగ్ జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఏ జిల్లాల్లో ఎక్కువగా ఓటేశారు?
ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం..
బేగుసరాయ్ జిల్లాలో అత్యధికంగా 67.32% ఓటింగ్ జరిగింది.
మదెపురాలో 65.74%,
సమస్తీపూర్‌లో 66.65%,
గోపాల్గంజ్‌లో 64.96%,
ముజఫర్‌పూర్‌లో 64.63% ఓట్లు నమోదయ్యాయి.
అదే సమయంలో పట్నాలో 55.02%, భోజ్‌పూర్లో 53.24%, శేఖ్‌పురాలో 52.36% మాత్రమే ఓటింగ్ జరిగింది.
ప్రముఖ అభ్యర్థుల నియోజకవర్గాల్లో పోలింగ్
రాఘోపూర్ (తేజస్వీ యాదవ్) – 64.01%
మహువా (తేజ్ ప్రతాప్ యాదవ్) – 54.88%
తారాపూర్ (సమ్రాట్ చౌధరి) – 58.33%
లఖిసరాయ్ (విజయ్ కుమార్ సిన్హా) – 60.51%
ఛపరా (ఖేసరి లాల్ యాదవ్) – 56.32%
అలీనగర్ (మైతిలి ఠాకూర్) – 58.05%
మోకామా (అనంత్ సింగ్) – 60.16%
అదేవిధంగా సరైరంజన్ (విజయ్ కుమార్ చౌధరి) లో అత్యధికంగా 70.19% ఓటింగ్ జరిగింది.
ప్రజాస్వామ్య స్పూర్తితో ముందుకు వచ్చిన ఓటర్లు
ఈసారి బీహార్ ప్రజలు ఎన్నికల్లో చురుకుగా పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలపరిచారు. ఎన్నికల సంఘం ప్రకారం, మొదటి దశలో 18 జిల్లాల్లో శాంతియుతంగా పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకే రికార్డు స్థాయి ఓటింగ్ జరగడం, ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరిగిందనడానికి నిదర్శనం.
ముఖ్యంశాలు
మొత్తం ఓటింగ్ (సాయంత్రం 5 గంటలకు): 60.13%
గత ఎన్నికల ఓటింగ్: 55.81%
అత్యధిక ఓటింగ్ జిల్లా: బేగుసరాయ్ (67.32%)
అత్యల్ప ఓటింగ్ జిల్లా: శేఖ్‌పురా (52.36%)
