సారాంశం

మతపరమైన విషయాలపై వివాదాస్పద ప్రకటనలు చేసి.. వివాదాల్లో ఇరుక్కున్న బీహార్ ప్రభుత్వ విద్యా మంత్రి చంద్రశేఖర్ యాదవ్ తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. రాముడు తన కలలో కనిపించాడని, తనను బజారులో అమ్ముడుపోకుండా రక్షించమని తనని వేడుకున్నాడంటూ విద్యాశాఖ మంత్రి తాజా వివాదం రేకెత్తించారు.

బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ యాదవ్ తన ప్రకటనల కారణంగా వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. రాముడు తన కలలో కనిపించాడని, తనను బజారులో అమ్ముడుపోకుండా రక్షించమని తనని వేడుకున్నాడంటూ విద్యాశాఖ మంత్రి మరో వివాదానికి తెర లేపారు. 

బీహార్‌లోని రామాపూర్ గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి చంద్ర శేఖర్ యాదవ్  మాట్లాడుతూ.. “నా కలలో రాముడు వచ్చి నన్ను ప్రజలు మార్కెట్‌లో అమ్ముతున్నారని.. అమ్మబడకుండా నన్ను రక్షించండి” అని వేడుకున్నాడన్నారు.  రామ్‌చరిత్‌మానస్‌ను "పొటాషియం సైనైడ్"తో పోల్చిన కొద్ది రోజుల తర్వాత ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశాడు.

మంత్రి చంద్ర శేఖర్ ఇటీవల తన ప్రసంగంలో దేశంలోని కుల వ్యవస్థ, మత విశ్వాసాలు, చారిత్రక వ్యక్తుల గురించి మాట్లాడారు. "శ్రీరాముడు శబరి ప్రసాదం తినేవాడు, కానీ.. నేడు శబరి కుమారుడిని ఆలయ ప్రవేశం నిషేధించబడటం విచారకరం. రాష్ట్రపతి, ముఖ్యమంత్రి కూడా ఆలయాలను సందర్శించకుండా అడ్డుకున్నారు. వారు వెళ్లిన తర్వత  ఆలయాలను గంగాజలంతో శుద్ధి చేస్తారు" అని బీహార్ మంత్రి కుల వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

గత వారం.. మంత్రి చంద్ర శేఖర్ మాట్లాడుతూ.. రామచరిత్మానస్ హిందువుల మత గ్రంధాన్ని "పొటాషియం సైనైడ్"తో పోల్చడాడు. " మీరు రుచికరమైన వంటకాలు తయారు చేసుకున్నారు.  అందులో పొటాష్ సైనైడ్ కలిపితే .. వాటిని మీరు తింటారా? హిందూ గ్రంథాల విషయంలో కూడా ఇదే జరుగుతోందని అన్నారు. బాబా నాగార్జున్, లోహియా సైతం దీనిపై విమర్శలు చేశారు. రామచరితమానస్‌‌పై కూడా అలాంటి అభిప్రాయమే ఉంది. ఆ అభిప్రాయం జీవితాంతం కొనసాగుతుంది. "అని అన్నారు.

కుల వివక్షకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు మాటల దూషణలకు దారితీశాయని, భౌతికంగా హాని చేస్తామనే బెదిరింపులు కూడా వచ్చాయని అన్నారు. మంత్రి చంద్ర శేఖర్ వ్యాఖ్యలు మిత్రపక్షమైన జెడి(యు) ప్రత్యర్థి బిజెపి నుండి మాత్రమే కాకుండా.. అతని స్వంత పార్టీ కూడా అతని వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తోంది.