బీహార్‌లో నితీశ్ కుమార్ సారథ్యంలో మహాఘట్‌బంధన్ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం వుంది. ఈ క్రమంలో తనకు మంత్రి పదవి ఇప్పించాలంటూ యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాశారు.  

బీహార్‌లో (bihar) ఎన్డీయే నుంచి తప్పుకున్న నితీశ్ కుమార్ (nitish kumar).. కాంగ్రెస్ (congress), ఆర్జేడీలతో (rjd) కలిసి మహాఘట్‌బంధన్ పేరిట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సీఎంగా నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే త్వరలోనే బీహార్‌లో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తనకు మంత్రి పదవి ఇప్పించాలంటూ ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ చీఫ్ సోనియా గాంధీకి (sonia gandhi) లేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి ఎన్నికైన ఏకైక యాదవ ఎమ్మెల్యేని తానేనని అతను లేఖలో పేర్కొన్నారు. ఖగారియా సదర్ ఎమ్మెల్యే ఛత్రపతి యాదవ్ ఈ మేరకు సోనియాకు లేఖ రాశారు. తన తండ్రి రాజేంద్ర ప్రసాద్ యాదవ్ ముగ్గురు సీఎంల కేబినెట్‌లలో పనిచేశారని ఛత్రపతి తెలిపారు. 

Bihar Politics: నితీష్ కుమార్ బ‌లప‌రీక్ష ఆనాడే.. ! మ‌రీ మహాఘట్‌బంధన్ అధికారం నిల‌బెట్టుకునేనా?

ఇకపోతే.. బీహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాఘటబంధన్ ప్రభుత్వం ఈ నెల 24న బ‌ల‌ప‌రీక్ష‌ను ఎదుర్కోనున్న‌ది. బుధవారం నాడు కుమార్, యాదవ్‌లు హాజరైన మంత్రివర్గ సమావేశంలో ఆగస్టు 24న ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాల‌ని నిర్ణ‌యించారు. రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరిచేందుకు తగిన సిఫారసు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న బీజేపీకి చెందిన విజయ్‌కుమార్‌ సిన్హా తొల‌గించాల‌ని మహాకూటమి నిర్ణయించింది. ఈ క్ర‌మంలో ఆగస్టు 16న మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని, జనతాదళ్-యునైటెడ్ కంటే ఆర్జేడీకే ఎక్కువ మంది మంత్రులు ఉంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. 242 మంది ఎమ్మెల్యేలున్న బీహార్‌ అసెంబ్లీలో మహాఘటబంధన్ లేదా మహాకూటమికి 164 మంది సభ్యుల మద్దతు ఉంది.