Bihar CM Nitish Kumar :బీహార్ అసెంబ్లీలో సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన సభలో అసభ్యకరమైన, అవమానకరమైన భాషను ఉపయోగించారని ప్రతిపక్షాలు విమర్శించడంతో సీఎం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.

Nitish Kumar : జనాభా నియంత్రణలో మహిళా విద్య పాత్రపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వింత వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై అసెంబ్లీలో తీవ్ర దుమారం రేగింది. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు. మంగళవారం మహిళా విద్య గురించి నిన్న రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడారు. అయితే ఆయన అసభ్యకరమైన, అవమానకరమైన భాషను ఉపయోగించారని ప్రతిపక్షాలు విమర్శించాయి.

Scroll to load tweet…

బుధవారం నితీస్ కుమార్ కు అసెంబ్లీలో అడుగుపెట్టే సమయానికి ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. దీంతో నితీష్ కుమార్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. ‘‘నేను నా మాటలను వెనక్కి తీసుకుంటున్నాను. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను కేవలం మహిళా విద్య గురించి మాత్రమే మాట్లాడాను. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించండి’’ అని నితీశ్ కుమార్ అన్నారు.

Scroll to load tweet…

జనాభా పెరుగుదలను అరికట్టడానికి బాలికల విద్య ఆవశ్యకతను నొక్కిచెబుతూ సీఎం మంగళవారం అసెంబ్లీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీహార్ సంతానోత్పత్తి రేటు 4.2 శాతం నుండి 2.9 శాతానికి ఎలా పడిపోయిందో నొక్కి చెబుతూ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై విమర్శలు రావడంతో తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను మహిళా విద్య గురించి చర్చిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు ఎవరికైనా అభ్యంతరకరంగా ఉంటే క్షమించాలని కోరారు.