Asianet News TeluguAsianet News Telugu

బీఆర్ఎస్ సభకు ఆహ్వానం అందింది, కానీ రావడం లేదు.. కేసీఆర్ కోరిక మేరకు వారు వస్తారు.. బీహార్ సీఎం నితీశ్ కుమార్

వచ్చేనెల హైదరాబాద్ లో జరిగే బీఆర్ఎస్ సభకు బీహార్ నుంచి  తేజస్వి యాదవ్, జెడియు అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ లు హాజరుకానున్నారు. 

Bihar CM Nitish Kumar not coming for BRS programmes in Hyderabad - bsb
Author
First Published Jan 30, 2023, 10:00 AM IST

పాట్నా : బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలంగాణలో జరగబోయే బీఆర్ఎస్ కార్యక్రమాలకు తాను హాజరు కావడం లేదని తెలిపారు. తెలంగాణలోవచ్చేనెలలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు…బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ నుంచి ఆహ్వానం అందిందని తెలిపారు. కానీ ఈ కార్యక్రమానికి తాను వెళ్లడం లేదని నితీష్ కుమార్ తెలిపారు. అయితే, తనకు బదులుగా హైదరాబాదుకు బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, జెడియు అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ లను  కేసిఆర్ కోరిక మేరకు పంపనున్నట్లు.. వారికి ఈ మేరకు  తెలిపానని విలేకరుల సమావేశంలో ఆదివారం నాడు చెప్పారు.

ఫిబ్రవరి 17న తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం జరగనుంది. ప్రారంభోత్సవం అనంతరం అదే రోజు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహణకు హైదరాబాదులోని పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే గతంలో బీఆర్ఎస్ సభ నేపథ్యంలో  కూడా నితీష్ విలేకరులతో మాట్లాడిన సంగతి తెలిసిందే. బిఆర్ఎస్ తో కలిసి నడుస్తానని చెప్పిన నితీష్ ఖమ్మంలో జరిగిన విఆర్ఎస్ ఆవిర్భావ సభకు  వెళ్లలేదు. దీనిమీద విలేకరులు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించగా.. ఆ సభకు తనకు ఆహ్వానం అందలేదని  తెలిపారు. ఒకవేళ పిలుపు అందినా కూడా తాను వెళ్లేవాడిని కాదని చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలోనే ఈసారి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల విషయంలో మరోసారి మీడియా ప్రశ్నించగా.. కేసీఆర్ నుంచి పిలుపు అందిందని..  అయితే, పనిఒత్తిడి కారణంగా తాను వెళ్లలేకపోతున్నానని చెప్పారు. సమాధాన్ యాత్రలో భాగంగా నితీష్ కుమార్ కైమూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్కడే విలేకరులతో మాట్లాడారు. 

బుల్లెట్ గాయాలతో ఒడిశా ఆరోగ్య మంత్రి మరణం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

బీఆర్ఎస్ కార్యక్రమానికి హాజరుకావాలని కేసీఆర్ ఆహ్వానించారు కానీ పనిఒత్తిడి వల్ల రాలేకపోతున్నానని చెప్పానని అన్నారు. దీంతో పార్టీ తరపున ఎవరినైనా పంపాలని కేసీఆర్ కోరారు. అందుకే ముందు నేను లలన్ ను వెళ్లమని చెప్పా.అయితే, కేసీఆర్ తేజస్వి యాదవ్ కు  చెప్పమని అడిగారు. దీంతో తేజస్వికి కూడా వెళ్ళమని చెప్పాను. అంతేకాదు నేను చెప్పాల్సింది చెబుతాను మీరు కూడా ఓసారి తేజశ్రీ యాదవ్ తో మాట్లాడమని కేసీఆర్ కు తెలిపాను. తేజస్వి యాదవ్, లలన్ లు హైదరాబాదులో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని’ నితీష్ అన్నారు.

తమకు కాంగ్రెస్తో ఉన్న భాగస్వామ్యంపై.. తమ పార్టీ నేతలు కేసీఆర్ సభకు వెళ్లడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పూర్తయిన తర్వాత.. వివిధ పార్టీల నేతలతో సమావేశం అవుతామని..  ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయడంపై నిర్ణయానికి వస్తామని జేడీయూ నేత నితీష్ మరోసారి తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios