Asianet News TeluguAsianet News Telugu

బీహార్ లో ఘోర అగ్ని ప్రమాదం.. బస్సు కింద ముగ్గురు బైకర్ల సజీవ దహనం.. వీడియోలు వైరల్..

బీహార్ లో ఓ అగ్నిప్రమాదం వీడియో అందర్నీ షాక్ కు గురిచేస్తోంది. బైక్ ను బస్సు గుద్దడంతో బస్సు కిందికి వెళ్లిన బైకర్ మంటల్లో సజీవ దహనం అయ్యాడు. 

Bihar bus accident, burning man under bus on camera
Author
First Published Oct 12, 2022, 12:38 PM IST

బీహార్ : బీహార్‌లోని చప్రా-సివాన్ హైవేపై బుధవారం ఉదయం పోలీసులతో వెళ్తున్న బస్సు ఢీకొనడంతో ముగ్గురు బైకర్లు మృతి చెందారు. వివరాల్లోకి వెడితే.. పోలీసు సిబ్బందితో వెడుతున్న బస్సు బైక్ పై వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఢీకొట్టింది. దీంతో ఆయిల్ ట్యాంకర్ పేలి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన చప్రా సివాన్ హైవేపై చోటు చేసుకుంది. ఆ బస్సులో బీహార్  పోలీస్ సిబ్బంది  ఉన్నారు. ఆ బస్సు డియోరియా గ్రామ సమీపంలో బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులను ఢీకొనడంతో.. వారిలో ఒకరు బైక్ తో సహా బస్సు కింద ఇరుక్కుపోయారు. 

దీంతో ఒక్కసారిగా ఇంధన ట్యాంకు పేలింది. అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఆ ముగ్గురు వ్యక్తులు బస్సు కిందికి రావడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. దీంతో బస్సు కింద ఇరుక్కున్న బైకర్ తో సహా మిగతా ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.  బస్సులో మంటలు చెలరేగడంతో పోలీసు అధికారులు వెంటనే బస్సు దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. సితాబ్దియారాలో దివంగత రాజకీయ నాయకుడు జయప్రకాష్ నారాయణ 120వ జయంతి వేడుకల్లో పాల్గొని పోలీస్ సిబ్బంది తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

ఉబర్, ఓలా, ర్యాపిడో సర్వీసుల నిలిపివేత‌.. ఆదేశాల‌ను ఉల్లంఘిస్తే.. ‘భరత్ అనే నేను’ రేంజ్‌లో..!

బస్సు ఢీ కొన్న తరువాత బైకర్లలో ఒకరు బస్సు కింద ఇరుక్కుని,  సుమారు 90 మీటర్ల వరకు ఈడ్చుకు పోబడ్డాడు. దీనికి సంబంధించిన వీడియోలు వెలుగులోకి రావడంతో ప్రస్తుతం ఈ విషాద వార్త అందర్నీ కలిచి వేస్తోంది.

ఇదిలా ఉండగా, చలి తీవ్రతను తట్టుకునేందుకు ఓ రైతు పొలంలో చలిమంట వేసుకున్నాడు. అదే అతనికి చితిమంట అయ్యింది. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.  భైంసా మండలం ఎగ్గాంకు చెందిన భూమన్న (70)..  పందుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు ఎప్పట్లాగే సోమవారం రాత్రి కూడా పొలానికి కాపలాగా వెళ్ళాడు. చలి అధికంగా ఉండడంతో పొలంలోని షెడ్డులో  చలిమంట వేసుకున్నాడు. దానికి పక్కనే మంచంపై పడుకున్నాడు.

అయితే అర్ధరాత్రి తర్వాత ఆ చలిమంట రగిలి.. షెడ్డుకు నిప్పు అంటుకుంది. షెడ్డులోని కట్టెలు, గడ్డి వంటివి అంటుకుని మంటలు వ్యాపించాయి. వాటిల్లోనే భూమన్న కూడా కాలిపోయాడు. మంగళవారం ఉదయం వ్యవసాయ పనుల కోసం అటుగా వచ్చిన కొందరు జరిగిన ప్రమాదాన్ని గుర్తించి భూమన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios