Bihar Election Results: చరిత్ర సృష్టించిన నితీష్ కుమార్... 4వ సారి ముఖ్యమంత్రి

Bihar Assembly Election 2020: Counting of votes to begin at 8am tomorrow, early trends likely by 10am lns

 బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి.ఈ ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

4:02 AM IST

బీజేపీ, నితీష్ కూటమిదే బీహార్

ఐపీఎల్ ఫైనల్ కన్నా ఉత్కంఠంగా సాగిన బీహార్ పొలిటికల్ లీగ్ పోరులో (డిఫెండింగ్) సిట్టింగ్ సీఎం నితీష్ కుమార్ మరోసారి తన  నిలుపుకుంటూ నాలుగవ పర్యాయం ముఖ్యమంత్రి అవ్వనున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో నాలుగు పర్యాయాలు వరుసగా ముఖ్యమంత్రి అయిన ఏకైక నేతగా నితీష్ కుమార్ నిలవనున్నారు. 

8:12 PM IST

హోరాహోరీ... మళ్లీ పుంజుకుంటున్న మహాగట్ బంధన్

ఎన్నికల ఫలితాల్లో లెక్కలు మారుతున్నాయి. మహాగట్ బంధన్ క్రమంగా పుంజుకుంటోంది. రెండు కూటముల మధ్యా స్వల్ప తేడానే వుంది. అప్పుడే తొందర పడొద్దని, చివరి వరకు వేచి చూడాలని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఎన్డీఏ ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ, మహాకూటమికి కూడా అవకాశాలు లేకపోలేదని నిపుణులు అంటున్నారు. చాలా చోట్ల ఎన్డీఏ ఆధిక్యం 1000 లోపే వుంది. రౌండ్ రౌండ్‌కు ఈ ఫలితం మారిపోయే ఛాన్స్ ఉండటంతో ఏ క్షణంలోనైనా ఈక్వేషన్స్ మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్థరాత్రి దాటిన తర్వాతే బీహార్‌‌లో పూర్తి స్థాయి ఫలితాలు వెలువడతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. 
 

5:15 PM IST

బిహార్ లో బిజెపిదే హవా... విజయం దిశగా ఎన్డిఎ కూటమి

బిహార్ లో ఇప్పటివరకు వెలువడిన ఫలితాలను పరిశీలిస్తే బిజెపి 2 చోట్ల విజయం సాధించి మరో 773 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక అధికార జెడియు 2 చోట్ల విజయం, 40 చోట్ల ఆధిక్యంలో వుంది. అలాగే ఆర్జేడి 2 చోట్ల విజయం, 69 చోట్ల ఆధిక్యంలో వుంది.కాంగ్రెస్ ఒకచోట విజయం సాధించగా 19 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.
 

4:51 PM IST

వెలువడ్డ మొదటి ఫలితం... ధర్బాంగలో బిజెపి విజయం

బిహార్ లో మొదటి ఫలితం వెలువడింది. 130 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న ఎన్డీఏ కూటమిలోని ఆర్జేడి పార్టీ అభ్యర్థి లలిత్ యాదవ్ విజయం సాధించారు. ధర్బాంగ నియోజకవర్గం నుండి అతడి గెలుపొందినట్లు ఈసీ ప్రకటించింది.   

3:32 PM IST

బిహార్ లో బిజెపికి భారిగా పెరిగిన సీట్లు

2015 ఎన్నికలతో పోల్చుకుంటే బిజెపి పార్టీ ఈ ఎన్నికల్లో23 సీట్లను అధికంగా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో జెడియు 19 సీట్లను కోల్పోయేలా కనిపిస్తోంది. ఓవరాలు ఎన్డిఎ కూటమి 7 సీట్లను అధికంగా గెలిచే అవకాశాలున్నట్లు ఎన్నికల ఫలితాలను చూస్తే అర్ధమవుతోంది.
 

2:37 PM IST

బిహార్ లో మరింత ఉత్కంఠ... 80 చోట్ల హెరాహోరీ

 బిహార్ ఎన్నికల ఫలితాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలను పరిశీలిస్తే దాదాపు 80చోట్ల హోరాహోరీ పోరు సాగుతున్నట్లు తెలుస్తోంది. 23 చోట్ల కేవలం 500 ఓట్ల తేడా వుండగా మరో 49 స్థానాల్లో 1000 ఓట్లు మాత్రమే తేడా వుంది. ఇక మరో 80 అసెంబ్లీ స్థానాల్లో 2000ఓట్ల తేడా మాత్రమే వున్నట్లు ఇప్పటివరకు వెలువడిన ఫలితాలు తెలియజేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే  128 స్థానాల్లో ఎన్డీఎ కూటమి, 104 స్థానాల్లో ఆర్జెడి, 2 చోట్లు ఎల్జేపి, 9 స్థానాల్లో ఇతరుల ఆధిక్యం కొనసాగుతోంది.  
 

2:05 PM IST

ఆలస్యంగా సాగుతున్న బిహార్ కౌంటింగ్... కారణమిదే: ఈసీ

ఈవిఎంల సంఖ్య అధికంగా వుండటంతో ఓట్ల లెక్కింపు ఆలస్యమవుతున్నట్లు బిహార్ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీనివాస్ వెల్లడించాడు. ఈ ఎన్నికల్లో మొత్తం 4.10 కోట్లమంది ఓటేయగా ఇప్పటివరకు 92లక్షల  ఓట్లను లెక్కించినట్లు తెలిపారు. ఇంకా భారీగా  ఓట్లను లెక్కించాల్సి వుండగా ఈ కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగనున్నట్లు ఈసి వెల్లడించింది. దీంతో తుది ఫలితం సాయంత్రం వరకు వెలువడే అవకాశాలున్నాయి. 

 

1:42 PM IST

బిహార్ లో పెరిగిన లెప్ట్ పార్టీల బలం

దేశవ్యాప్తంగా లెప్ట్ పార్టీల బలం రోజురోజుకూ తగ్గుతున్నా బిహార్ లో మాత్రం ఏమాత్రం తగ్గినట్లుగా లేదు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలను పరిశీలిస్తే 20 స్థానాల్లో లెప్ట్ పార్టీలు పోటీలో వున్నట్లు తెలుస్తోంది. సిపిఐ(ఎంఎల్) 14, సిపిఐ 3, సిపిఎం 2 చోట్ల పోటీచేయగా 2015 తో పోల్చితే ఈసారి గట్టిపోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.  

 
 

1:17 PM IST

ఓటమిపై కాంగ్రెస్ ది మళ్లీ అదేపాట... ఈవీఎం హ్యాకింగ్ ఖాతాలోనే

ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ ఆ ఓటమికి ఈవీఎంల హ్యాకింగ్ కారణమంటూ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇలా ఓటమిని అంగీకరించి అందుకు గల కారణాలను అన్వేషించి సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా దాటవేసే ప్రయత్నం చేశారు. తాజాగా బిహార్ ఓటమిని కూడా ఈ ఈవిఎంల హ్యాకింగ్ ఖాతాలోనే వేసింది కాంగ్రెస్. 

''మార్క్ మరియు చంద్రుడిపై పంపించాల్సిన రాకెట్లనే తిరిగి భూమికి చేరేలా కంట్రోల్ చేస్తున్నారు. అలాంటిది ఈవీఎంలను హ్యాక్ చేయలేరా?'' అంటూ అధికార పార్టీపై కాంగ్రెస్ నాయకుడు ఉదిత్ రాజ్ ట్విట్టర్ వేదికన కామెంట్స్ చేశారు. 

1:06 PM IST

శతృఘ్న సిన్హా తనయుడు లవ్ సిన్హా ఓటమి

బంకిపూర్ నియోజకవర్గం నుండి పోటీచేసిన మాజీ ఎంపి శతృఘ్న సిన్హా తనయుడు, కాంగ్రెస్ అభ్యర్థి లవ్ సిన్హా ఓటమిపాలయ్యారు. బిజెపి అభ్యర్థి నితిన్ నబిన్ చేతిలో1200 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. 

12:56 PM IST

బిహార్ లో అతిపెద్ద పార్టీగా బిజెపి...

ఇప్పటివరకు వెలువడిన ఫలితాలను పరిశీలిస్తే బిజెపి పార్టీ బిహార్ లో అతిపెద్ద పార్టీగా అవతరించేలా కనిపిస్తోంది. ఓటింగ్ శాతాన్ని పరిశీలిస్తే బిజెపి 19.9, ఆర్జేడి 22.9. జెడియు 15.6 శాతంగా వున్నాయి. ఇక కాంగ్రెస్ పరిస్థితి మరీ ఘోరంగా వుంది. ఆ పార్టీకి కేవలం 9.25శాతం ఓట్లు వచ్చాయి. ఎల్జేపికి 6.3శాతం ఓట్లు నమోదయ్యాయి. 

 

11:57 AM IST

బిహార్ లో సంచలన ఫలితాలు... అంతకంతకు తగ్గుతున్న ఆర్జెడి ఆధిక్యం

బిహార్ లో ఎన్నికల కౌంటింగ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఉదయం నుండి ఆధిక్యంలో కొనసాగిన ఆర్జెడి అంతకంతకు తగ్గుతోంది. అధికార జెడియు కూటమి 130 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శించగా ఆర్జేడి కేవలం 99 స్థానాలకే పరిమితమయ్యింది. ఇక ఎల్జెపి 5 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. 
 

11:56 AM IST

రెండు చోట్ల ఎంఐఎం ఆధిక్యం

 

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ రెండు నియోజకవర్గాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. అమోర, బైసి అసెంబ్లీలో ఎంఐఎం అభ్యర్ధులు ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. 
 

11:17 AM IST

లాలూ తనయుడు వెనుకంజ

బిజెపి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. స్వయంగా మాజీ సీఎం తనయుడు, ప్రస్తుతం ఆర్జేడి సీఎం అభ్యర్ధి తేజస్వి యాదవ్ సోదరుడు తేజ్ ప్రతాప్ హసన్ పూర్ లో వెనుకంజలో వున్నాడు. 

10:20 AM IST

బిహార్ లో ప్రారంభమైన క్యాంప్ రాజకీయాలు... కాంగ్రెస్ ముందుజాగ్రత్త

ఓవైపు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న సమయంలోనే బిహార్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి స్వల్ప ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నా హంగ్ దిశగా ఫలితాల సరళి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తమ పార్టీ నుండి గెలిచే అవకాశమున్న అభ్యుర్థులను కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కు తరలించే ఏర్పాట్లు చేస్తోంది. పాట్నాలోని హోటల్ మౌర్యకు దాదాపు 15 నుండి 20మంది అభ్యర్ధులను తరలించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. 
 

10:20 AM IST

మ్యాజిక్ ఫిగర్ దాటిన జెడియు ఆధిక్యం...తగ్గుతున్న ఆర్జేడి హవా

బిహార్ లో అధికార జెడియు కూటమి అనూహ్యంగా ముందంజలోకి దూసుకెళ్లింది. ఎగ్జిట్ పోల్స్ ను తలకిందులు చేస్తూ జెడియు 125 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంటే ఆర్జేడి ఆధిక్యం 109 స్థానాలకు పరిమితమయ్యారు. 
 

9:53 AM IST

బిహార్ లో టగ్ ఆఫ్ వార్... తగ్గుతున్న ఆర్జేడి ఆధిక్యం, దూసుకుపోతున్న జెడియు

బిహార్ లో జెడియు పోటీలోకి వచ్చింది. ఆర్జెడిని వెనక్కి నెట్టి 119 స్థానాల్లో జెడియు ఆధిక్యంలోకి వచ్చింది. ఉదయం నుండి భారీ ఆధిక్యంలో కొనసాగిన ఆర్జేడి ప్రస్తుతం కేవలం 114 స్థానాల్లో ముందంజలో  కొనసాగుతోంది. 


 

9:33 AM IST

శత్రుఘ్న సిన్హా తనయుడు లవ్ సిన్హా వెనుకంజ

బంకింపూర్ లో మాజీ ఎంపీ శత్రుఘ్న సిన్హా తనయుడు లవ్ సిన్హా వెనుకంజ 

8:58 AM IST

విజయం దిశగా దూసుకుపోతున్న ఆర్జేడి, మూడో స్థానానికి జేడియు

బిహార్ లో ఆర్జేడి పార్టీ విజయం దిశగా దూసుకువెళుతోంది. మొత్తం 243 స్థానాల్లో ఆర్జేడి 124, జెడియు 92, ఎల్జేపి 2 స్థానల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. 
 

8:58 AM IST

డాన్ అనంత్ సింగ్ ముందంజ

ముకామాలో డాన్ అనంత్ సింగ్ ముందంజలో వున్నాయి 

8:58 AM IST

ముందంజలో శరద్ యాదవ్ కూతురు

బిహరీ గంజ్ లో శరద్ యాదవ్ కూతురు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుభాషిణి ముందంజలో వున్నారు.
 

8:46 AM IST

పప్పు యాదవ్ వెనుకంజ

మాదేపురాలో పప్పు యాదవ్ వెనుకంజలో వున్నారు. 

8:41 AM IST

జోకీపాట్ లో ఎంఐఎం ముందంజ

బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే జోకీపాట్ స్థానంలో ఎంఐఎం ముందంజలోకి వెళ్లింది. 

8:37 AM IST

ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ముందంజ

రాఘోపూర్ అసెంబ్లీ స్థానంలో ఫోటీకి దిగిన ఆర్జెడి కీలక నాయకులు తేజస్వి యాదవ్  ముందంజలో వున్నారు. అలాగే హసన్ పూర్ నుండి తేజ్ ప్రతాప్ యాదవ్ ముందంజలో వున్నారు.  
 

8:24 AM IST

దూసుకుపోతున్న మహా ఘట్ బంధన్

మహా ఘట్ బంధన్ 46, ఎన్డీఏ కూటమి 22 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో వున్నాయి. 

8:17 AM IST

ముందంజలో ఆర్జెడి... వెనకబడ్డ జెడియు

బిహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. ప్రస్తుతం  అధికార జేడియు 13, ఆర్జెడి 15 స్థానాల్లో ఆధిక్యంలో వున్నాయి. 

8:04 AM IST

బిహార్ ఎన్నికల కౌంటింగ్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా మరికొద్ది సేపట్లో ఒక్కో అభ్యర్ధి భవితవ్యం బయటపడనుంది. 

8:32 PM IST

నవంబర్ 10న కౌంటింగ్ ప్రారంభం

ఒకవేళ హంగ్ ఏర్పడితే చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీతో పాటు ఇండిపెండెంట్లు ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. నవంబర్ 10వ తేదీ ఉదయం 8 గంటలకు  కౌంటింగ్ ప్రారంభం కానుంది.

8:32 PM IST

బీహార్ కోటలో పాగా ఎవరిది

ఈ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ), బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి.పలు మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలు మహాకూటమికి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చే అవకాశం ఉందని తేల్చి చెప్పాయి.