Asianet News TeluguAsianet News Telugu

వార్తా ప్రచురణ సంస్థలకు కంటెంట్ కోసం దిగ్గజ టెక్ కంపెనీలు డబ్బులు చెల్లించాలి: కేంద్రం స్పష్టీకరణ

వార్తా ప్రచురణ సంస్థలకు అవి క్రియేట్ చేసిన వార్తలను అగ్రిగేటర్‌గా అందరికీ అందుబాటులో తెచ్చే టెక్ కంపెనీల మధ్య సంబంధాలు ప్రపంచవ్యాప్తంగా దిగజారిపోతున్నాయి. మీడియా హౌజ్ కంటెంట్‌ను గూగుల్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు సెర్చ్ రిజల్ట్‌లు, ఫీడ్‌లో ఇచ్చి ఆర్థిక లబ్ది పొందుతుంటే.. నిజంగా కంటెంట్ క్రియేటర్‌కు ముట్టేది చాలా తక్కువ. అందుకే టెక్ కంపెనీలు సరైన స్థాయిల్లో వార్తా ప్రచురణ సంస్థలకు కచ్చితంగా చెల్లింపులు జరపాలని కేంద్రం స్పష్టం చేసింది.
 

big tech companies to pay for congent creator, backs centre
Author
First Published Jan 21, 2023, 4:28 PM IST

న్యూఢిల్లీ: వార్తలను, వాటి లింక్‌లను సెర్చ్ రిజల్ట్, ఫీడ్‌లలో చూపించి దిగ్గజ టెక్ కంపెనీలు వాటి ప్రచురణ సంస్థలకు డబ్బులు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ వార్తా ప్రచురణ సంస్థలతో టెక్ కంపెనీలు ఫెయిర్ షేర్‌ రెవెన్యూ చెల్లించాలని వివరించింది. ఈ రెండింటి మధ్య నెలకొన్న అసమతుల్యతను పరిష్కరించాల్సి ఉన్నదని తెలిపింది.

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఇన్ఫర్మేషన్ బ్రాడ్‌క్యాస్టింగ్ సెక్రెటరీ అపూర్వ చంద్ర ఈ విషయంపై మాట్లాడారు. పాత్రికేయ భవిష్యత్, వార్తా పరిశ్రమ (డిజిటల్, ప్రింట్) ఆర్థిక ఆరోగ్యం కాపాడటం ముఖ్యమైన విషయం అని వారు నొక్కి చెప్పారు.

డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ నిర్వహించిన ఓ కాంక్లేవ్‌లో వీరు మాట్లాడారు. మీడియా కంపెనీలు ఆర్థికంగా కుంగిపోవడానికి పై సమస్య ఒకటి అని అపూర్వ చంద్ర తెలిపారు. వార్తా పరిశ్రమ అభివృద్ధికి అన్ని ప్రచురణ సంస్థల డిజిటల్ వార్తా వేదికలు చాలా ముఖ్యమైనవని, వీటి వార్తలతో అగ్రిగేటర్‌గా వ్యవహరించి, ఇతరుల కంటెంట్‌ను అందుబాటులోకి తెచ్చే టెక్ కంపెనీలకు కచ్చితంగా తగిన స్థాయిలో రాబడిని పంచుకోవాల్సిందే అని అపూర్వ చంద్ర తెలిపారు. 

Also Read: గూగుల్ టాప్ సెర్చ్ ఫిల్మ్ లు ఇవే, RRR ప్లేస్ ఏంటంటే

ఈ సందర్భంగా వార్తా ప్రచురణ సంస్థలు, గూగుల్, ఫేస్‌బుక్ వంటి దిగ్గజ సంస్థల నడుమ ఏర్పడ్డ వివాదంపై ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, ఈయూలు వాటి డిమాండ్లకు అనుగుణంగా చట్టాలు రూపొందించాయి.న్యూస్ కంటెంట్ క్రియేటర్లు, అగ్రిగేటర్ల మధ్య రాబడిని సరైన స్థాయిలో సరిగా పంచుకుంటున్నాయి. ఈ విషయాలను చంద్ర ప్రస్తావించారు.

కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో వీడియో కాల్‌లో అటెండ్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ, కంటెంట్ క్రియేషన్‌కు, మానిటైజేషన్‌కు మధ్య ఏర్పడ్డ అగాధాన్ని, యాడ్ టెక్ కంపెనీలకు ఉన్న అధికారం, వార్తా వేదికలకు మధ్య తేడాలను పరిష్కరిస్తామనే ఆశిస్తున్నట్టు వివరించారు. ముఖ్యంగా కంటెంట్ క్రియేషన్, దాని ద్వారా డబ్బు సంపాదించడానికి (మానిటైజేషన్) సంబంధించి ఇంటర్నెట్‌ నిర్మాణంలోనే ఇన్‌బిల్ట్ ఇంబ్యాలెన్స్ ఉన్నదని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios