Asianet News TeluguAsianet News Telugu

గూగుల్ టాప్ సెర్చ్ ఫిల్మ్ లు ఇవే, RRR ప్లేస్ ఏంటంటే

ఇండియన్‌ సినిమా హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో కేజీఎఫ్‌ 2, ఆర్‌ఆర్‌ఆర్‌లాంటి మూవీస్‌ నిలిచాయి. అయితే సెర్చ్‌లో మాత్రం వీటిని వెనక్కి నెట్టి బ్రహ్మాస్త్ర నిలవడం విశేషం.

Brahmastra and KGF 2 are Google most searched films
Author
First Published Dec 8, 2022, 8:46 AM IST


సంవత్సరం చివరకు వచ్చేసింది. ఈ క్రమంలో 2022 లో జరిగిన ఈవెంట్స్ పై సమీక్ష జరుగుతూంటుంది. ఎప్పటిలాగే గూగుల్ లో ఎక్కువ మంది చూసిన సినిమాల లిస్ట్ వచ్చేసింది. ఆ లిస్ట్  చూసిన చాలా మంది షాక్ అయ్యారు. అందుకు కారణం ఏమిటంటే...

ఈ ఏడాదికి గాను అత్యధికంగా గూగుల్‌లో వెతికిన చిత్రంగా బ్రహ్మస్త్ర టాప్ లో నిలిచింది. కాగా గూగుల్ సెర్చ్ ఇంజిన్ ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2022’ని తాజాగా ఆవిష్కరించింది. ఈ ఏడాది 11 నెలల్లో ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్న జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో రెండో స్థానంలో కేజీఎఫ్-2, మూడో స్థానంలో ది కశ్మీర్ ఫైల్స్, నాలుగో స్థానంలో ఆర్ఆర్ఆర్, ఐదో స్థానంలో కాంతార నిలిచాయి. ఆ తరువాత వరుసగా పుష్ప-ది రైజ్, విక్రమ్, లాల్ సింగ్ చద్ధా, దృశ్యం-2, థోర్-లవ్ అండ్ థండర్‌ సినిమాలు ఉన్నాయి.

మొదటి పది స్థానాల్లో దక్షిణాదికి చెందిన ఐదు చిత్రాలు ఉండగా.. కేవలం నాలుగు హిందీ చిత్రాలు మాత్రమే చోటు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. గత కొంతకాలంగా ఫిల్మ్ ఇండస్ట్రిలో దక్షిణాది సినిమాల హవా కొనసాగుతున్న తరుణంలో ఈ మూవీ వాటిని వెనక్కినెట్టి ముందు వరుసలో నిలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దక్షిణాదిలో ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్, కాంతార , కార్తికేయ 2 వంటి చిత్రాలు దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. 
 
బ్రహ్మాస్త్ర టాప్‌లో నిలవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మిగతా మూడు సినిమాలతో పోలిస్తే కమర్షియల్‌గా అంత సక్సెస్‌ కాలేకపోయినా.. మూవీస్‌ సెర్చ్‌ లిస్ట్‌లో మాత్రం పైన ఉండటం విశేషం. రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ నటించిన బ్రహ్మాస్త్ర పార్ట్‌ వన్‌ - శివ మూవీ ఈ ఏడాది విపరీతమైన బజ్‌ క్రియేట్‌ చేసింది. సుమారు ఐదేళ్ల పాటు షూటింగ్‌ జరుపుకొని ఈ ఏడాది రిలీజ్ కావడంతో ఎక్కువ మంది దీని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించమే కారణం కావచ్చు.

 అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, మౌని రాయ్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. విజువల్ వండర్‌గా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుని పలు రికార్డులను తిరగ రాసింది. కాగా ఇటీవల కాలంలో బాలీవుడ్ లో సినిమాలన్నీ ఫ్లాప్ బాట పడుతున్న నేపధ్యంలో ఈ సినిమా హిట్ సాధించి హిందీ చిత్ర పరిశ్రమకు కొంత ఊరటని ఇచ్చిందనే చెప్పాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios