Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం నగ్ దగ్ పెల్ గి ఖోర్లో

ఈ మేరకు భూటాన్ ప్రధాని ట్విటర్‌లో చేసిన ఒక ట్వీట్‌లో, "అత్యున్నత పౌర పురస్కారం అయిన నగ్ దాగ్ పెల్ గి ఖోర్లోకు మీ ప్రియతమ నాయకుడు మోదీజీ  నరేంద్ర మోడీ పేరును హిజ్ మెజెస్టి ఉచ్ఛరించడం వినడానికి చాలా ఆనందంగా ఉంది" అని పేర్కొంది.

Bhutans highest civilian award Ngadag Pel gi Khorlo for Prime Minister Narendra Modi
Author
Hyderabad, First Published Dec 17, 2021, 11:27 AM IST

న్యూఢిల్లీ, డిసెంబర్ 17 : Bhutanప్రభుత్వం భారత ప్రధాని Narendra Modiకి అరుదైన గౌరవాన్ని అందించింది. ప్రధాని నరేంద్ర మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం Ngadag Pel gi Khorlo ఇవ్వనున్నట్లు భూటాన్ ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ మేరకు భూటాన్ ప్రధాని ట్విటర్‌లో చేసిన ఒక ట్వీట్‌లో, "అత్యున్నత పౌర పురస్కారం అయిన నగ్ దాగ్ పెల్ గి ఖోర్లోకు మీ ప్రియతమ నాయకుడు మోదీజీ  నరేంద్ర మోడీ పేరును హిజ్ మెజెస్టి ఉచ్ఛరించడం వినడానికి చాలా ఆనందంగా ఉంది" అని పేర్కొంది.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో భూటాన్ కు భారతదేశం బేషరతుగా మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని మోదీని నగ్ దాగ్ పెల్ గి ఖోర్లోతో సత్కరించాలని ఆ దేశం నిర్ణయించింది. 

UP Assembly Election 2022 : ఢిల్లీలో బీజేపీ ఎంపీలతో మోదీ బ్రేక్ ఫాస్ట్.. యూపీలో అమిత్ షా ర్యాలీ..

ఇదే విషయాన్ని ఫేస్‌బుక్ పోస్ట్‌లో భూటాన్ పీఎంఓ ఇలా చెప్పుకొచ్చింది.. "ఎన్నో ఏళ్లుగా భారత్ భూటాన్ కు సహాయ హస్తం అందిస్తూనే ఉంది. ముఖ్యంగా మహమ్మారి సమయంలో భారత ప్రధాని మోడీజీకి అందించిన భేషరతు సహాయం, మద్దతును మరువలేం దీన్నేహెచ్‌ఎం హైలైట్ చేసారు. మోది ఈ అవార్డుకు చాలా అర్హులు. ఈ సందర్భంగా ఆయనకు భూటాన్ ప్రజల నుండి అభినందనలు. అన్ని పరస్పర చర్యలలో, ప్రధానికి గొప్పగా చూసారు, మోదీ spiritual human being. ఈ గౌరవాన్ని ఆయనకు వ్యక్తిగతంగా అందించే వేడుక కోసం ఎదురు చూస్తున్నాను." అని రాసుకొచ్చింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios