Asianet News TeluguAsianet News Telugu

Bhopal crime News: మధ్యప్రదేశ్ లో హిందూ దేవాలయంపై దాడి! శివ‌లింగాన్ని ధ్వంసం చేసిన దుండ‌గులు

Bhopal crime News: మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో చోళ ప్రాంతానికి చెందిన ఓ ఆలయంలో శివలింగం ధ్వంసం చేసిన వెలుగులోకి వ‌చ్చింది. దీంతో స్థానికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. పికెటింగ్ చేస్తామని హిందూ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

Bhopal crime News Madhya Pradesh Shivling vandalised in a temple in Bhopal, probe underway
Author
Hyderabad, First Published Aug 4, 2022, 1:13 PM IST

Bhopal crime News: మధ్యప్రదేశ్ భోపాల్‌లోని ఓ ఆలయంలో శివలింగం ధ్వంసం చేసిన ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపుతోంది. న‌గ‌రంలోని చోళ‌ప్రాంతంలోని ప్రాచీన కాలం నాటి ఆల‌యంలో శివలింగం ధ్వంసం చేయబడింది. స్థానికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఘ‌ట‌న స్థలానికి చేరుకున్న పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఘటనానంతరం సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నామని, ఈ విషయమై ఆలయ పరిసర వ్యక్తులను ప్రశ్నిస్తున్నామని నగర ఏసీపీ సచిన్ ఠాకూర్ తెలిపారు.

ఇదిలాఉంటే.. నిందితులను వెంటనే అరెస్టు చేయకుంటే పికెటింగ్ చేస్తామని హిందూ సంస్థలు వార్నింగ్ ఇచ్చాయి. ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ ఆల‌యం చోళుల కాలంలో క‌ట్ట‌డిన‌ట్టు స్థానికులు తెలిపారు. 

శివాలయాన్ని కూల్చివేయడం పట్ల ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆలయంలో ప్రతిష్టించిన శివలింగాన్ని ఎవరో బరువైన రాయితో పగలగొట్టారు. ఘటనా స్థలం నుంచి ఒక రాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం 6 గంటలకు భక్తులు పూజలు చేసేందుకు ఆలయానికి చేరుకోగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని కూల్చివేతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పాటు నిందితుడిని త్వరగా అరెస్ట్ చేయకుంటే ఘటనా స్థలంలోనే పికెట్ చేస్తానని బెదిరించారు. ముందుజాగ్రత్తగా ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
    
ఈ ఘ‌ట‌న‌పై హనుమాన్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మహేంద్ర సింగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ.. చోళా రోడ్డులో ఉన్న సర్దార్ పటేల్ స్కూల్ సమీపంలో శివాలయంలో దాడి జ‌రిగింద‌ని తెలిపారు. రాత్రి 11 గంటలకు యథావిధిగా పూజలు చేసి ఆలయ ద్వారం మూసివేశారు. ఈ ఆలయ ద్వారం తాళం వేయలేదు. బుధవారం ఉదయం ఆరు గంటల స‌మ‌యంలో పూజ‌లు చేయ‌డానికి భక్తులు రావ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. శివలింగాన్ని ఎవరో బరువైన రాయితో పగలగొట్టినట్లు గుర్తించారు.

ఈ విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకుడు హరినారాయణ్ మాలి సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఆలయాన్ని ధ్వంసం చేసిన వెంటనే పోలీసు బలగాలను అక్కడికి పంపించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఈ ఘటన జరిగి ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. 

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలిస్తున్నారు. ఓ సీసీ పుటేజీలో నిందితుడు క‌నిపిస్తున్న‌.. ఫుటేజీ అస్పష్టంగా ఉండటంతో నిందితుడి గుర్తింపు స్పష్టంగా కనిపించలేదు. హరినారాయణ్ మాలి ఫిర్యాదు మేరకు మత మనోభావాలను దెబ్బతీసినందుకు గుర్తు తెలియని వారిపై కేసు నమోదు చేశారు.

ఘటన జరిగిన వెంటనే వందలాది మంది విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకున్నారని హరినారాయణ్ మాలి తెలిపారు. ఈ ఘటనపై హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు. నిందితులను సత్వరమే అరెస్టు చేయాల‌నీ, లేక‌పోతే.. ఘటనా స్థలంలో ధర్నా, ప్రదర్శన చేపడతామని ప్రజలు చెబుతున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios