ఉత్తరప్రదేశ్ హోటల్‌లో ఓ వర్ధమాన నటి మృతదేహం కనిపించింది. హోటల్‌లో ఉరి తాడుకు వేలాడుతూ కనిపించింది. పోలీసులు ఇది ఆత్మహత్య లాగే కనిపిస్తున్నదని వివరించారు. పోస్టుమార్టం రిపోర్టు తర్వాత వాస్తవ కారణం తెలుస్తుందని అన్నారు.  

వారణాసి: ఉత్తరప్రదేశ్‌లో యువ నటి విగత జీవై కనిపించింది. యూపీలోని హోటల్‌లో వర్ధమాన నటి భోజ్‌పూరి మోడల్ నుంచి యాక్టర్‌గా మారిన ఆకాంక్ష దూబే మృతదేహం ఆదివారం లభించింది. 25 ఏళ్ల ఆకాంక్ష దూబే ఆ హోటల్‌లో ఉరితాడుకు వేలాడుతూ కనిపించిందని పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహఆన్ని పోస్టు మార్టం కోసం పంపించారు. ప్రాథమికంగా ఇది ఆత్మహత్య  అని భావిస్తున్నామని వివరించారు. అయితే, పోస్టు మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మరణానికి అసలైన కారణం తెలుస్తుందని చెప్పారు.

Scroll to load tweet…

హోటల్ రూమ్‌లో యువ నటి ఆకాంక్ష దూబే ఉరి తాడుకు వేలాడుతూ హోటల్ సిబ్బందికి కనిపంచింది. వారు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. 

Also Read: Honey Rose: పెళ్లి అనేది బాధ్యత అందుకే అక్కడి వరకూ వెళ్ళను ప్రేమతో సరిపెడతాను!

ఇదిలా ఉండగా, ఆమె మరణానికి ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చారు. చాలా సేపు లైవ్‌లో ఖాళీగా కూర్చుని చూస్తూ ఉండిపోయారు. మానసిక ఆందోళనలో ఉన్నట్టు ఆమె కనిపించింది. మరో వీడియోలో ఆమె ఏడుస్తూ కనిపించింది. ఇప్పుడు ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది మానసిక వేధింపుల కారణంగా తీసుకున్న నిర్ణయం అని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు. 

Scroll to load tweet…

ఆకాంక్ష దూబే భోజ్‌పూరి సినిమా, మ్యూజిక్ సాంగ్‌లలో ఎక్కువగా కనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆకాంక్ష దూబేకు విశేష ఆదరణ ఉన్నది. చాలా మంది ఆమె వీడియోలను ఫాలో అవుతుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చేసే వీడియోలు చాలా ఫేమస్ అయ్యాయి.