Honey Rose: పెళ్లి అనేది బాధ్యత అందుకే అక్కడి వరకూ వెళ్ళను ప్రేమతో సరిపెడతాను!
వీరసింహారెడ్డి ఫేమ్ హనీ రోజ్ హైదరాబాద్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రేమ పెళ్లి వంటి వ్యక్తిగత విషయాలపై కామెంట్ చేశారు.
హైదరాబాద్ నగరంలో హీరోయిన్ హనీ రోజ్ సందడి చేశారు. ఆమె ఓ రెస్టారెంట్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. మదీనా గూడలో కొత్తగా జిస్మత్ జైలు పేరుతో మండి ఏర్పాటు చేయగా దీని ఓపెనింగ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు. హనీ రోజ్ రాకను తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. అనంతరం హనీ రోజ్ మీడియాతో మాట్లాడారు.
వీరసింహారెడ్డి మూవీలో నా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. బాలకృష్ణ వంటి లెజెండ్ తో నటించే అవకాశం రావడం సంతోషం. నేను రెండు విభిన్నమైన పాత్రలు చేశాను. అందుకోసం చాలా కష్టపడ్డాను. గోపీచంద్ మలినేని ఫోన్ చేసి నా పాత్ర గురించి వివరించారు. ఇక షూటింగ్ సమయంలో బాలయ్య నాకు సలహాలు ఇచ్చారు.
నటన అంటే చిన్నప్పటి నుండి ఇష్టం. 2005లోనే పరిశ్రమకు వచ్చాను. సినిమాలు తప్ప నాకు మరో పని తెలియదు. నేను కేరళ ఫుడ్ బాగా ఇష్టపడతాను. హైదరాబాద్ బిర్యానీ, రైస్ , పెరుగు కూడా నచ్చాయి. పెళ్లి అనేది ఒక బాధ్యత. అందుకే నేను ప్రతి విషయాన్ని ప్రేమిస్తాను. అంత వరకే వెళతాను. సోషల్ మీడియాలో మంచి చెడు రెండూ ఉంటాయి... అని హనీ రోజ్ చెప్పుకొచ్చారు.
మలయాళ నటి అయిన హనీ రోజ్ తెలుగులో చేసిన మొదటి చిత్రం ఆలయం. 2008లో ఈ చిత్రం విడుదలైంది. శివాజీ హీరోగా నటించారు. ఆ సినిమా ఆడకపోవడంతో హనీ రోజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలియకుండా పోయింది. 2014లో వరుణ్ సందేశ్ కి జంటగా ఈ వర్షం సాక్షిగా అనే చిత్రం చేశారు. మరో ఎనిమిదేళ్ల తర్వాత వీరసింహారెడ్డి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. వీరసింహారెడ్డిలో హనీ రోజ్ బాలయ్యకు భార్యగా, తల్లిగా రెండు భిన్నమైన రోల్స్ చేశారు.