జీ 20 అతిథులకు ‘‘భారత్: ది మదర్ ఆఫ్ డెమోక్రసీ’’ బుక్‌లెట్.. 8 వేల సంవత్సరాల అద్భుత చరిత్ర.. మీరు చూడండి..
భారత ప్రెసిడెన్సీ జీ 20 సదస్సు విజయవంతంగా సాగిన సంగతి తెలిసిందే. జీ20 సదస్సుకు హాజరైన ప్రముఖులకు ‘భారత్: ది మదర్ ఆఫ్ డెమోక్రసీ’’ (భారత్ - ప్రజాస్వామ్యానికి తల్లి) అనే బుక్‌లెట్‌ను జీ20 అందించారు.

భారత ప్రెసిడెన్సీ జీ 20 సదస్సు విజయవంతంగా సాగిన సంగతి తెలిసిందే. జీ20 సదస్సుకు ముందు కేంద్ర ప్రభుత్వం రెండు బుక్‌లెట్‌లను విడుదల చేసింది. అందులో ‘‘భారత్: ది మదర్ ఆఫ్ డెమోక్రసీ’’, ‘‘ఎలక్షన్స్ ఇన్ ఇండియా’’లను విడుదల చేసింది. అందులో 6,000 BCE నుంచి భారత ప్రజాస్వామ్యం మూలాలను గుర్తించడంతో పాటు.. ‘‘భారత్ అనేది దేశం అధికారిక పేరు’’ అని ప్రారంభంలోనే పేర్కొంది. ‘‘భారత్: ది మదర్ ఆఫ్ డెమోక్రసీ’’ (భారత్ - ప్రజాస్వామ్యానికి తల్లి) అనే బుక్‌లెట్‌ను జీ20 సదస్సుకు హాజరైన ప్రముఖులకు అందించారు.
ఇందులో గత 8000 సంవత్సరాల భారతదేశం అద్భుతమైన చరిత్రను ప్రస్తావించారు. 'సింధు-సరస్వతి నాగరికత', రామాయణం, మహాభారతం.. అశోకుడు, అక్బర్, చోళులు, విజయనగర సామ్రాజ్యాల పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో ప్రస్తావించింది. కౌటిల్యుడు, మెగస్తనీస్, ఇతరుల బోధనలను కూడా పేర్కొంది. అయితే బుక్‌లెట్‌లో మొఘల్, బ్రిటిష్ పాలన గురించి ప్రస్తావించబడలేదు. ఇందులో నిజమైన భారతీయ రాజుల గురించిన సమాచారం మాత్రమే ఉంది.
ఈ 52 పేజీల బుక్‌లెట్ ‘‘భారత్: ది మదర్ ఆఫ్ డెమోక్రసీ’’ బుక్‌లెట్ మొదటి పేజీలో భారత్ అనేది దేశం అధికారిక పేరు అని పేర్కొన్నారు. ఈ బుక్‌లెట్‌ను చూడాలంటే ఈ లింక్‌పైన క్లిక్ చేయండి.. (https://ebook.g20.org/ebook/bharatmod/index.html).