Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర ప్రభావంతో ఆరెస్సెస్ చీఫ్ మదర్సాలు, మసీదులను సందర్శించవలసి వచ్చిందనీ, త్వరలోనే ప్రధాని మోడీ టోపీ ధరించడం ప్రారంభిస్తారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు దిగ్విజయ అన్నారు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం, కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ లు బీజేపీకి సహాయం చేసే ప్రయత్నంలో ఇతర పార్టీల ఓట్లను చీల్చేందుకు గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ఆరోపించారు. 

Congress leader Digvijaya Singh: రాహుల్ గాంధీ నేతృత్వంలోని 'భారత్ జోడో యాత్ర' ప్రభావం కారణంగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ మదర్సాలు, మసీదును సందర్శించవలసి వచ్చిందనీ, త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ "టోపీ" ధరించడం ప్రారంభిస్తారని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ సింగ్ మంగళవారం అన్నారు. సౌదీ అరేబియా, ఇతర దేశాలలో ముస్లింలు ధరించే స్కల్ క్యాప్‌ మాదిరిగా పీఎం మోడీ "టాపీ" ధరిస్తారనీ, అయితే భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అలా చేయకూడదని భారత్ జోడో యాత్రకు నిర్వాహక కమిటీకి నాయకత్వం వహిస్తున్న దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ నాయకత్వంలో భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది.

“భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రస్తుతం రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుంటోంది. ఎందుకంటే (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ 'భారత్ జోడో యాత్ర' జరిగిన ఒక నెలలోనే మదర్సా, మసీదులను సందర్శించడం ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లో ప్రధాని మోడీ కూడా టాపీ ధరించడం ప్రారంభిస్తారు’’ అని దిగ్విజయ్ సింగ్ మీడియాతో అన్నారు. 2011 సెప్టెంబరులో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అహ్మదాబాద్‌లో సద్భావన నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ముస్లిం మతపెద్ద ఇచ్చిన స్కల్ క్యాప్ ధరించడానికి నరేంద్ర మోడీ నిరాకరించారు. భగవత్ సెప్టెంబర్‌లో ఢిల్లీలోని మసీదు, మదర్సా (ఇస్లామిక్ సెమినరీ)ని సందర్శించి ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇలియాసితో చర్చలు జరిపారని అన్నారు.

సెప్టెంబరు 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర రెండు నెలల్లోనే దేశంలోని పేదలు మరింత పేదలుగా మారుతున్నారనీ, ధనికులు మరింత ధనవంతులు అవుతున్నారని సంఘ్ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పాల్సి వచ్చిందని దిగ్విజయ్ సింగ్ అన్నారు. అయితే, "ఈ భరత్ జోడో యాత్ర చివరి గమ్యస్థానమైన శ్రీనగర్‌కు చేరుకున్నప్పుడు ఏమి జరుగుతుందో మీరు చూస్తారు" అని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన ప్రజల సంక్షేమం పేరుతో అధికార భారతీయ జనతా పార్టీ కేవలం జిమ్మిక్రీపై మాత్రమే ఆధారపడుతుందని ఆరోపించారు. “ద్రౌపది ముర్ము మన దేశానికి రాష్ట్రపతి అయినందుకు మేము గర్విస్తున్నాము. మధ్యప్రదేశ్‌లో గిరిజనులపై జరిగిన అఘాయిత్యాల గురించి ఆమె మాట్లాడతారని ఆశిస్తున్నాం. ఆమె ఈ అంశంపై మాట్లాడకూడదనుకుంటే, ఈ అంశంపై ఆమెతో చర్చించడానికి మా ప్రతినిధి బృందానికి కొంత సమయం ఇవ్వవచ్చు” అని దిగ్విజయ్ సింగ్ అన్నారు.

షెడ్యూల్ కులానికి చెందిన రామ్‌నాథ్ కోవింద్ కూడా ఇంతకుముందు రాష్ట్రపతి అయ్యారని సింగ్ అన్నారు. రాష్ట్రపతి కోవింద్ హయాంలో దేశంలోని కోట్లాది మంది దళితులకు తమ ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనాలను అందించిందో ప్రధానమంత్రి చెప్పాలని ఆయన అన్నారు. అలాగే, ఆప్, ఆమ్ ఆద్మీలపై కూడా దిగ్విజయ్ సింగ్ విమర్శలు గుప్పించారు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం, కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ లు బీజేపీకి సహాయం చేసే ప్రయత్నంలో ఇతర పార్టీల ఓట్లను చీల్చేందుకు గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ఆరోపించారు. వాళ్లే బీజేపీ బీ టీమ్ అని విమర్శించారు.