పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర! డిసెంబర్-ఫిబ్రవరిలో చేపట్టడానికి ప్లాన్

పార్లమెంటు ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అదిరిపోయే స్ట్రాటజీని రచిస్తున్నది. ఎన్నికలకు ముందే రెండో విడత భారత్ జోడో యాత్రను చేపట్టాలని కాంగ్రెస్ ప్రణాళికలు చేస్తున్నదని కీలక వర్గాలు తెలిపాయి.
 

bharat jodo yatra 2.0 to conduct before lok sabha elections kms

న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా కలిసి వచ్చింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విచ్ఛిన్నకర తీరును తప్పుబడుతూ దేశాన్ని కలిపి ఉంచాలనే లక్ష్యంతో భారత్ జోడో యాత్రను కాంగ్రెస్ చేపట్టింది. ఆర్థిక సమస్యలు, నిరుద్యోగాన్ని పేర్కొంటూ రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుంచి జమ్ము కశ్మీర్ వరకు ఈ యాత్ర చేశారు. ప్రేమ దుకాణం అనే పదాన్ని ఈ యాత్రలోనే రాహుల్ గాంధీ పేర్కొన్నారు. యాత్ర పూర్తయిన జమ్ము కశ్మీర్‌లోనూ రాహుల్ గాంధీ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ యాత్ర ఒక రకంగా కాంగ్రెస్‌కు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. ఇదే భారత్ జోడో యాత్రను కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికలకు ముందు నిర్వహించాలని ప్లాన్ వేస్తున్నది.

ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే నెల ఫిబ్రవరి మధ్యలో భారత్ జోడో యాత్ర 2.0 చేపట్టాలని కాంగ్రెస్ ప్రణాళికలు వేస్తున్నట్టు కీలక సమాచారం అందింది. ఈ యాత్ర హైబ్రిడ్ మోడ్‌లో ఉంటుందని ఆ వర్గాలు వివరించాయి. ఈ యాత్రలో పాల్గొనేవారు నడుచుకుంటూ అలాగే వాహనాల్లోనూ ప్రయాణించే విధంగా భారత్ జోడో యాత్ర 2.0ను డిజైన్ చేస్తున్నట్టు తెలిపాయి. 

Also Read: చత్తీస్‌ఘడ్ లో తొలి విడత పోలింగ్: ఆ నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లే కీలకం

తొలి విడత భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ 2022 సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభించారు. సుమారు 4080 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జనవరిలో ముగించారు. ఈ యాత్ర 12 రాష్ట్రాల గుండా సాగింది. ఇందులో ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలు భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని భరోసా ఇస్తూ సాగారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios