సీరం బాటలో భారత్ బయోటెక్... రాష్ట్రాలకు ఊరట, రూ.400కే కొవాగ్జిన్
ఎట్టకేలకు కొవాగ్జిన్ వ్యాక్సిన్ ధరను తగ్గించింది భారత్ బయోటెక్. రాష్ట్రాలకు రూ.400కే టీకా డోసును విక్రయించనున్నట్లు చెప్పింది. మొదట్లో రూ.600కి డోసును విక్రయిస్తామని తెలిపింది భారత్ బయోటెక్.
ఎట్టకేలకు కొవాగ్జిన్ వ్యాక్సిన్ ధరను తగ్గించింది భారత్ బయోటెక్. రాష్ట్రాలకు రూ.400కే టీకా డోసును విక్రయించనున్నట్లు చెప్పింది. మొదట్లో రూ.600కి డోసును విక్రయిస్తామని తెలిపింది భారత్ బయోటెక్. అయితే కేంద్రానికి ఒక రేటు, రాష్ట్రాలకు ఒక రేటుపై టీకాలు విక్రయించడంపై విమర్శలు వచ్చాయి.
కేంద్రాన్ని రాష్ట్రాలు నేరుగా నిలదీయడంతో .. టీకా ధరలు తగ్గించాలని వ్యాక్సిన్ తయారీదారులను కోరింది భారత ప్రభుత్వం. నిన్న కొవిషీల్డ్ ధరను తగ్గించగా.. ఇవాళ భారత్ బయోటెక్ కూడా ధరలు తగ్గించింది. తగ్గించిన ధరలతో కొవాగ్జిన్ రూ.400కు రాష్ట్రాలకు వస్తుండగా.. కొవిషీల్డ్ రూ.300కు విక్రయించింది.
Also Read:కేంద్రం విజ్ఞప్తి... వెనక్కి తగ్గిన సీరం: రాష్ట్రాలకు రూ.300కే కోవిషీల్డ్
కాగా, బుధవారం రాష్ట్రాలకు గుడ్‌న్యూస్ చెప్పారు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) అధినేత అధర్ పూనావాలా. రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేయబోయే కోవిషీల్డ్ ధరలను తగ్గించడానికి అంగీకరించింది.. రాష్ట్రాలకు డోసును రూ.300కే అందిస్తామని ప్రకటించింది.
మొదట్లో డోసును రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400కు ప్రైవేట్ ఆస్పత్రులకు అయితే రూ.600కు ఇస్తామని ప్రకటించింది సీరం. కానీ, ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
దీంతో వ్యాక్సిన్ ధరలు తగ్గించాలంటూ.. సీరంతో పాటు కొవాగ్జిన్‌ను తయారు చేస్తున్న భారత్ బయోటెక్‌ను కూడా కోరింది కేంద్రం. దీంతో రాష్ట్రాలకు కోవిషీల్డ్ ధరను 25 శాతం మేర తగ్గించి రూ.300కే ఒక డోసును ఇస్తున్నట్లు అధర్ పూనావాలా ట్వీట్ చేశారు.
కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం. #ANCares #IndiaFightsCorona