బాలిక విద్యను ప్రోత్సహించేందుకు, డ్రాప్ అవుట్స్ ను నిరోదించేందుకు పంజాబ్ లోని భగవంత్ మాన్ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. తమ ప్రభుత్వం విద్యకు, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం ప్రకటించారు. 

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విద్యార్థుల కోసం కొత్త పథ‌కాన్ని ప్ర‌క‌టించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే బాలికల కోసం షటిల్ బస్సు సర్వీసును ప్రారంభించనున్నట్లు సోమ‌వారం తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జ‌రిగిన ఓ స‌భ‌లో మాన్ ప్ర‌స‌గింస్తూ ఈ విష‌యాన్ని వెల్ల‌డించార‌ని అధికారిక ప్రకటన తెలిపింది.

పిల్లలను దత్తత తీసుకున్న మహిళలకు ఆరు నెలల అడాప్షన్ లీవులు.. హిమాచల్ ప్రభుత్వం సంచలనం

రవాణా, ఆహారం, మౌలిక సదుపాయాలు, ఇతర ప్రాథమిక అవసరాలను చూసుకుంటూనే ప్రతీ చిన్నారికి గుణాత్మక విద్యను అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని సీఎం అన్నారు. ‘‘ రవాణా సౌకర్యాలు లేనప్పుడు బాలికలలో పాఠశాల డ్రాపవుట్ రేటు చాలా ఎక్కువగా ఉంది, కాబట్టి ఈ దృగ్విషయాన్ని తీవ్రంగా ఎదుర్కోవడానికి రాష్ట్రంలోని ప్రతి ఆడపిల్లకు ఈ సదుపాయాన్ని మంజూరు చేయాలని మేము నిర్ణయించుకున్నాం’’ అని మాన్ చెప్పారు.

Scroll to load tweet…

ఉపాధ్యాయుల సేవలను బోధనా విధులకు మాత్రమే వినియోగిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి, బోధనేతర పనులకు వాటిని ఉపయోగించబోమని మళ్లీ నొక్కి చెప్పారు. డిజిటల్ ఎడ్యుకేషన్ నేడు ఆవశ్యకమని అభివర్ణిస్తూ ప్రపంచ స్థాయిలో పోటీపడటం తప్పనిసరి అన్నారు. ఢిల్లీ ప్ర‌భుత్వం తీసుకున్న ఇలాంటి నిర్ణయం తరహాలో కొత్త బోధనా నైపుణ్యాలను పొందడానికి ఆక్స్ ఫర్డ్, హార్వర్డ్, ఇతర ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలకు ఉపాధ్యాయులను పంపాలని నిర్ణయించామ‌ని చెప్పారు. త‌న తండ్రి ఒక ఉపాధ్యాయుడు అని, అందుకే ఉపాధ్యాయుల ప్రాథమిక అవసరాలు, సమస్యలు, దురవస్థలు తనకు తెలుసని మాన్ చెప్పారు. 

నిద్ర రావట్లేదని ఆత్మహత్య.. హాస్టల్‌లో రాత్రిళ్లు తిరుగుతూ.. చివరకు తీవ్ర నిర్ణయం

ఈ సంద‌ర్భంగా ఉపాధ్యాయులతో త‌న‌కున్న అనుభ‌వాల‌ను సీఎం పంచుకున్న మాన్.. వారంటే త‌న‌కు ఎంతో గౌర‌వం అని పేర్కొన్నా,రు. ఆందోళన మార్గాన్ని విడనాడాలని, చర్చలకు ఆహ్వానించాలని ఉపాధ్యాయులను కోరిన ఆయన, గత ప్రభుత్వాల హయాంలో అవలంబించిన విధానాలు అవాంఛిత ఆటంకాలను సృష్టించాయని అన్నారు. అయితే ఆందోళ‌న క‌లిగించే ప్ర‌ధాన‌ అంశాలైన విద్య, ఆరోగ్యంపై ఆప్ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి సారించామ‌ని చెప్పారు. 

ఎస్‌బీఐ బ్యాంకులో కింగ్ మహాబలి.. ఓనమ్ సందర్భంగా ఉద్యోగి వినూత్న ఆలోచన (వీడియో)

శ్రీ ఆనంద్ పూర్ సాహిబ్, నంగల్ లను ఎకో టూరిజం గమ్యస్థానాలుగా అభివృద్ధి చేస్తామని మాన్ ప్రకటించారు. 100 'స్కూల్స్ ఆఫ్ ఎమినెన్స్'ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, వీలైనంత త్వరగా ఈ ప్రకటనను క్షేత్రస్థాయిలో అమ‌లు చేయ‌డానికి ఆ శాఖ అవిశ్రాంతంగా కృషి చేస్తోందని పాఠశాల విద్యాశాఖ మంత్రి హర్జోత్ బెయిన్స్ ఈ సంద‌ర్భంగా తెలిపారు.