Asianet News TeluguAsianet News Telugu

ఎస్‌బీఐ బ్యాంకులో కింగ్ మహాబలి.. ఓనమ్ సందర్భంగా ఉద్యోగి వినూత్న ఆలోచన (వీడియో)

కేరళలోని ఓ ఎస్‌బీఐ బ్యాంకులో ఉద్యోగి కింగ్ మహాబలి గెటప్‌లో వచ్చి సేవలు అందించారు. కేరళవాసులు ఎంతో ఉత్సాహం, ఇష్టంతో జరుపుకునే ఓనమ్ సందర్భంగా ఆ ఉద్యోగి ఇలా గెటప్‌లో కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
 

sbi employee came to branch in king mahabali getup.. se here viral video
Author
First Published Sep 6, 2022, 3:07 AM IST

తిరువనంతపురం: కేరళలో ఓనమ్ ఫెస్టివల్ చాలా ఫేమస్. దేశవ్యాప్తంగా కేరళ వాసులు ఎక్కడ ఉన్నప్పటికీ ఈ ఓనమ్ వేడుకలు జరుపుకుంటారు. ఎంతో ఉత్సాహంగా వేడుక చేసుకుంటారు. ఈ పండుగ వారం పొడవూ ఉంటుంది. ఈ సారి ఆగస్టు 30న మొదలై.. ఈ నెల 8వ తేదీన ముగియనుంది. ఈ పండుగ సందర్భంగా ఓ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎసల్‌బీఐ) ఎంప్లాయీ వినూత్న ఆలోచనను అమల్లో పెట్టాడు. కింగ్ మహాబలి గెటప్‌లో వచ్చి బ్యాంకు కౌంటర్‌లో కూర్చున్నాడు. ఆయన యథావిధిగా కస్టమర్లకు సేవలు అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

ఈ వీడియో క్లిప్‌ను నిక్సన్ జోసెఫ్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. వీడియోతో పాటు ఆయన కీలక సమాచారాన్ని కూడా పోస్టు చేశారు. ఇలా మహారాజు మహాబలి గెటప్‌లో ఓ ఉద్యోగి వచ్చిన ఘటన కేరళలోని తలస్సెరీలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో చోటుచేసుకున్నట్టు క్యాప్షన్‌లో రాసుకొచ్చారు. ఒనమ్ సంబురాలు మొదలైన సందర్భంగా ఆ బ్యాంకు ఉద్యోగి కింగ్ మహాబలి మేకప్‌లో బ్యాంకుకు వచ్చారు. 

లెజెండరీ కింగ్ మహాబలి సందర్శన ఓనమ్ సందర్భంగా జరుగుతుంది. ఈ అంశాన్ని ఆధారం చేసుకుని ఆ ఉద్యోగి కింగ్ మహాబలి గెటప్‌లో బ్యాంకు వచ్చి ఉద్యోగం చేశారు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో షేర్ చేయగానే సుమారు 31వేల మంది వీక్షించారు.

ఆ ఉద్యోగిపై పలువురు ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు చేశారు. ఆ ఉద్యోగి ఎనర్జీ లెవెల్స్ చూడముచ్చటగా ఉన్నాయని ఒకరు అభిప్రాయపడ్డారు. ఆ ఉద్యోగి ఆలోచన వావ్ అంటూ మరొకరు  కామెంట్ చేశారు. బ్యాంకు కూడా ప్రతి పండుగను ఇలాగే ఎంతో ఉత్సాహంగా సెలబ్రేట్ చేయాని సూచించారు. ఓనమ్ స్పిరిట్‌పై సంతోషంగా ఉన్నారని, ఆ స్టాఫ్ రూపం పండుగ వేడులకును మరింత ఉత్తేజకరం చేసేలా ఉన్నాయని వివరించారు. కాగా, కొందరేమో అభ్యంతరం తెలిపారు. ఉద్యోగులు అందరికీ ఎస్‌బీఐ డ్రెస్ కోడ్ తేవాలని కామెంట్ చేశారు. ఒక వేళ ఈ గెటప్‌ను మెచ్చుకుంటూ ఇతర బ్రాంచీల్లోనూ సేవల కంటే ఈ నాటకలే ఎక్కువ జరుగుతాయని ఆగ్రహించారు.

Follow Us:
Download App:
  • android
  • ios