హైదరాబాద్: హైదరాబాద్ వైద్యురాలు దిశా ఎన్ కౌంటర్ తరువాత ప్రజలంతా రోడ్లపైకి వచ్చి తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. మిఠాయిలు పంచుతూ, బాణాసంచాకాలుస్తూ, ప్రజలు పండగ చేసుకుంటున్నారు. 

ఈ ఎన్ కౌంటర్ నేపథ్యంలో, సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజెన్ల. హాట్స్ ఆఫ్ తో సజ్జనార్ సర్ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది కూడా. సజ్జనార్ ను తెలుగు ప్రజలు ముద్దుగా ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అని పిలుచుకుంటారు. 

గతంలో ఆయన వరంగల్ యాసిడ్ దాడి నిందితులను, నయీమ్ ఎన్ కౌంటర్లలోనూ కీలక పాత్ర పోషించారు. ఇవి కేవలం వెలుగులోకి వచ్చిన కొన్ని మాత్రమే. ఆయన తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేయడం వల్ల ఒక సారి తన ప్రమోషన్ ను కూడా కోల్పోవాలిసి వచ్చింది. 

Also read: CP V.C. Sajjanarఎన్ కౌంటర్ స్పెషలిస్ట్: ఎవరీ వీసీ సజ్జనార్?...

మరో మారు ఎన్ కౌంటర్ అనే పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండడంతో, ప్రజలంతా ఇంకా భారత దేశంలో ఉన్న ఎన్ కౌంటర్ స్పెషలిస్టులు ఎవరు అనే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో మీకోసం ఒక నలుగురు ఫేమస్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ వివరాలు. వీరి ట్రాక్ రికార్డు చూస్తే మాత్రం ఇన్ని ఎన్ కౌంట్ర్లా అని ముక్కున వేలేసుకుంటారు. 

వీరంతా ముంబై పోలీసు డిపార్టుమెంటు కె చెందిన వారు. అప్పట్లో అండర్ వరల్డ్ డాన్ల ప్రాబల్యం అత్యధికంగా ఉన్న సమయంలో వీరంతా, ముంబై నగరాన్ని సామాన్య ప్రజలకు సురక్షితం చేయడం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. 

మరో మాట, వీరంతా ఏ ఐపీఎస్ అధికారుల్లో అనుకోకండి, వీరంతా సాధ సీదా ఇన్స్పెక్టర్లు లేదా అంతకన్నా తక్కువస్థాయి పోలీసు అధికారులు మాత్రమే. అప్పట్లో వీరి కుటుంబాలను సైతం మాఫియా డాన్లు టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 

ప్రదీప్ శర్మ... 

ముంబై నగర వాసులకు పరిచయం అవసరం లేని పేరు. సిన్సియర్ ఆఫీసర్ గా ఇతనికి మంచి పేరుంది. క్రైమ్ ని ఎట్టిపరిస్థితుల్లోనయినా ముంబై నగరం నుంచి తరిమేయాల్సిందే అని ఎప్పుడు అంటూ ఉండేవాడు. ఈయన పేరు మీదు ఉన్న ఎన్ కౌంటర్ల సంఖ్య "312"

దయ నాయక్... 

ఫేమస్ తెలుగు సినిమా గోలీమార్ చిత్రానికి ఈయనే స్ఫూర్తి. ఈయనను ఏమి చేయలేక ఒక జర్నలిస్టు ద్వారా ఇతనికి అండర్ వరల్డ్ తో సంబంధాలున్నాయని, ఒక ఆరోపణ చూపించింది మాఫియా.

Also read: DishaCaseAccusedEncounter : సజ్జనార్ సార్! మా మాట కూడా ఒక్కసారి వినండి

( గోలీమార్ చిత్రంలోలాగా ఇతను మాఫియా డాన్ అవ్వలేదు లెండి) ఇతను కోర్టు చుట్టూ తిరిగి, తన మీద ఉన్న ఆరోపణలు తప్పు అని నిరూపితమయ్యేవరకు పోరాడాడు. ఇతని ఎన్ కౌంటర్ల కౌంట్ "83"

ప్రఫుల్ భోంస్లే... 

ముంబై అండర్ వరల్డ్ డాన్లకు ఇతనొక సింహ స్వప్నం. ముంబై నగరంలోని అండర్ వరల్డ్ నేరస్థులను ఒక్కొక్కరిగా ఏరిపారేసాడు. అప్పటి ముంబై డిప్యూటీ కమీషనర్ భోంస్లే గురించి చాలా గొప్పగా చెప్పేవారు. ఇతని పేరు మీద ఉన్న ఎం కౌంటర్ల సంఖ్య "77"

రవీంద్రనాథ్ ఆంగ్రే... 

థానే కు చెందిన ఈ డైనమిక్ ఆఫీసర్, గ్యాంగ్స్టర్ల గుండెల్లో నిద్రపోయేవాడు. ఇతను ముంబై పోలీసు డిపార్టుమెంటు లో సబ్ ఇన్స్పెక్టర్ గా జాయిన్ అయ్యాడు. అక్కడి నుంచి మొదలు, తన ధైర్యసాహసాలకు మెచ్చి, ఇతన్ని ఈ స్పెషల్ టీం లోకి తీసుకున్నారు. తన బృందంతో కలిసి పలువురు అండర్ వరల్డ్ ముఠా సభ్యులను ఇతను ఎన్ కౌంటర్ చేసాడు. 

స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్లు ఎదుర్కునే సమస్యలనే ఈయన కూడా ఎదుర్కున్నాడు. ఇతని మీద తప్పుడు కేసులు బనాయించడం జరిగింది. ఆ తరువాత ఆ కేసులు నిరాధారమైనవి అని తేలడంతో అతను తిరిగి ఉద్యోగంలో చేరాడు. ఇతని కౌంట్ "54". 

సచిన్ వాజే... 

దావూద్, చోట రాజన్ గంగులకు ఇతను పేరు చెబితే చమటలు పట్టేవి. ఇతను కేవలం ఇలా హార్డ్ పోలీస్ ఆఫీసర్ గానే కాకుండా స్మార్ట్ పోలీస్ ఆఫీసర్ గా కూడా చాలా ఫేమస్. ఇతను మొబి సిఐడి అనే ఒక యాప్ ను కూడా తీసుకు వచ్చాడు. 

ఇతను శివసేన పార్టీతో కొద్దిగా క్లోజ్ గా ఉండేవాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి శివసేనతో చేరారు. ఇతని కౌంట్ "63". 

విజయ్ సలస్కర్... 

ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ సలస్కర్ ఒక విలక్షణ అధికారి. ఇతను ముంబై ఎన్ కౌంటర్ స్క్వాడ్ లో కీలక సభ్యునిగా వ్యవహరించాడు. 2008లో ముంబై టెర్రరిస్ట్ దాడిలో ఇతను వీర మరణం పొందాడు. 

ఇతని ధైర్య సాహసాలను గుర్తించిన ప్రభుత్వం ఇతనికి మరణానంతరం అశోక చక్ర ప్రకటించింది. ఇతని పేరు మీద ఉన్న ఎన్ కౌంటర్ల సంఖ్యా "61". అనధికారిక లెక్కల ప్రకారం ఆసంఖ్య 80 దాకా ఉండొచ్చని అంటున్నారు.