ఓ నిండూ చూలాలు వైద్యం కోసం ఆస్పత్రికి వస్తే.. పుట్టినరోజు వేడుకల్లో ఉన్నాం.. కావాలంటే వేరే ఆస్పత్రికి వెళ్లమన్నారు వైద్య సిబ్బంది
ఓ నిండూ చూలాలు వైద్యం కోసం ఆస్పత్రికి వస్తే.. పుట్టినరోజు వేడుకల్లో ఉన్నాం.. కావాలంటే వేరే ఆస్పత్రికి వెళ్లమన్నారు వైద్య సిబ్బంది. మధ్యప్రదేశ్‌లోని బైతూల్ జిల్లా ఆసుపత్రిలో పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీని ఆమె భర్త ఈ నెల 7వ తేదీన ఆసుపత్రికి తీసుకొచ్చాడు.. అక్కడ ఆమెను కూర్చొబెట్టి.. ఓపీ రాయించుకుని వైద్యుల వద్దకు వెళ్ళిన భర్తకు అక్కడి సిబ్బంది అంతా బర్త్‌డే వేడుకల్లో కనిపించారు.
తన భార్య పరిస్థితి బాగోలేదని వైద్యం చేయాలని కోరగా..దానిని వారు ఏమాత్రం పట్టించుకోకపోగా.. వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని కఠినంగా చెప్పారు. కుటుంబీకులు కూడా ఆమెకు వైద్యసాయం అందించాలని ప్రాధేయపడినప్పటికీ సిబ్బంది, వైద్యులు కనికరించలేదు.. గంటసేపు వేచి చూసి చివరికి చేసేది లేక ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లామని బాధితురాలి భర్త తెలిపాడు. అయితే ఈ తతంగాన్నంతా వీడియో తీశానని.. దీనిని ముఖ్యమంత్రి హెల్ప్‌లైన్‌కు పంపించానని తెలిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
