అనంతరం ఆదివారం ఉదయం 7గంటలకు భర్త నిద్రపోతుండగా... బాగా మసిలిన నూనె తీసుకువెళ్లి మీద పోసింది. ఆ వేడి బాధ తట్టుకోలేక మంజునాథ్ అరుస్తూ బయటకు పరుగులు తీశాడు.

తనను కాదని మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. తనను మోసం చేస్తున్నాడన్న విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. అంతే.. నిద్రపోతున్న భర్త పై వేడి వేడి మసిలే నూనె పోసింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పూర్తి వివరాల్లోకి వెళితే... బెంగళూరు నగరానికి చందిన మంజునాథ్(40) ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. మంజునాథ్ తో కలిసి యశ్వంత్ పూర్ లోని మోహన్ కుమార్ నగర్ లో నివసిస్తున్నాడు. అతనికి 9 సంవత్సరాల క్రితం పద్మ అనే మహిళతో వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల మంజునాథ్ కి మరో మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

Also Read ఇంట్లో ఐదుగురు మృతి: కుళ్లిపోయి దుర్వాసన వేస్తున్న శవాలు...

ఈ విషయంలో తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం కూడా ఇదే విషయంపై దంపతులు వాగ్వాధానికి దిగారు. అనంతరం ఆదివారం ఉదయం 7గంటలకు భర్త నిద్రపోతుండగా... బాగా మసిలిన నూనె తీసుకువెళ్లి మీద పోసింది. ఆ వేడి బాధ తట్టుకోలేక మంజునాథ్ అరుస్తూ బయటకు పరుగులు తీశాడు.

గమనించిన స్థానికులు వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. అతనికి ప్రాణాపాయ స్థితి తప్పినప్పటికీ.. అతని శరీరం దాదాపు 50శాతం మేర కాలిపోయింది. ముఖం, చేతులు, భుజాలపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.