Asianet News TeluguAsianet News Telugu

స్టార్టప్‌లకు స్పూర్తి: బెంగుళూరు సభలో ప్రధాని మోడీ

బెంగుళూరులో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ప్టార్టప్ లకు బెంగుళూరు స్పూర్తిగా నిలుస్తుందని ఆయన చెప్పారు. 

Bengaluru represents Start-upspirit: PM Modi
Author
First Published Nov 11, 2022, 1:34 PM IST

బెంగుళూరు: స్టార్టప్ లకు భారతదేశం ప్రసిద్ది చెందిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. బెంగుళూరు స్టార్టప్ స్పూర్తిని సూచిస్తుందన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని పలు అభివృద్ది కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోడీ  పాల్గొన్నారు. అనంతరం బెంగుళూరులో  నిర్వహించిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు.  స్టార్టప్ లకు భారత్ ప్రపంచంలోనే ప్రసిద్ది చెందిందన్నారు. ఇందులో బెంగుళూరు ప్రధాన భూమిక పోషిస్తుంందని ప్రధాని చెప్పారు.ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కర్ణాటక రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందన్నారు.ఐటీ రంగంలోనే కాకుండా రక్షణ ,బయో టెక్నాలజీ రంగంలో కర్ణాటక పెట్టుబడులను ఆకర్షించిందన్నారు. గత మూడేళ్లలో కర్ణాటక రాష్ట్రం 4లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని మోడీ గుర్తు చేశారు. డబుల్ ఇంజన్ బలంతో రాష్ట్రం అభివృద్దిలో పురోగమిస్తుందని ప్రధాని మోడీ చెప్పారు.

. భారతదేశ అభివృద్దిలో కనెక్టివిటీ  ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రధాని చెప్పారు.ఎయిర్ కనెక్టివిటీ ,కొత్త విమానాశ్రయాల ఏర్పాటు ఎంతో అవసరమని ప్రధాని తెలిపారు. బెంగుళూరు ఎయిర్ పోర్టులో విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ సౌకర్యాలను మరింత  పెంచనుందన్నారు..2014లో దేశంలో 70 విమానాశ్రయాలుంటే ప్రస్తుతం వాటి సంఖ్య 140కి పెరిగిందని మోడీ గుర్తు చేశారు.  కనెక్టివిటీ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వ్యాపారాన్ని కూడా అభివృద్ది చేసే అవకాశం ఉందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు.అంతేకాదు దేశంలోని యువతకు ఉపాధిని అందిస్తుందని ఆయన చెప్పారు. దేశం వేగంగా పరుగెత్తాలని కోరుకుంటుందన్నారు.ఇందు కోసం తాము సాధ్యమైన చర్యలు తీసుకుంటున్నట్టుగా మోడీ చెప్పారు.రానున్న 10 ఏళ్లలో భారత రైల్వే రూపు రేఖలు  మారుతాయని ప్రధాని మోడీ చెప్పారు. ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మోడీ వివరించారు.

వృద్ది సాధించాలంటే భౌతిక, సామాజిక మౌళిక సదుపాయాలను అభివృద్ది చేయాలని పీఎం చెప్పారు. కర్ణాటకలో తొలి వందే ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభించామన్నారు. బెంగుళూరు ఎయిర్ పోర్టులో టెర్మినల్ కూడా ప్రారంభించినట్టుగా ఆయన  చెప్పారు. ఇది బెంగుళూరు ప్రజల అవసరంగా ఆయన పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios