మన దేశంలో బైక్ పై డ్రైవర్ లేదా రైడర్ అయినా హెల్మెట్ ధరించకపోవడం ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనే. బెంగళూరు పోలీసు అధికారి ఈ రూల్స్ ఉల్లంఘించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఓ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై అధికారులు స్పందించారు. 

చెన్నై: మన దేశంలో టూ వీలర్ పై వెళ్లేవారు హెల్మెట్ ధరించాలనేది రూల్. ఈ రూల్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ది మోటార్ వెహికిల్స్ యాక్ట్‌లో ప్రత్యేకంగా 129 సెక్షన్ టూ వీలర్ డ్రైవర్ లేదా పిలియన్ రైడర్ హెల్మెట్ ధరించకపోవడం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనగా పేర్కొంటారు. ఇది మన దేశంలో ఇల్లీగల్ అఫెన్స్. అయితే, కొందరు పోలీసు అధికారులకు ఈ నియమాలేవీ వర్తించవన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని సోషల్ మీడియా యూజర్లు కొందరు ఆరోపణలు చేస్తారు. తాజాగా, ఇలాంటి కామెంటే ఒకరు ట్వీట్ చేశారు. 

బెంగళూరులో ఓ పోలీసు ఆఫీసర్ టూ వీలర్ పై పిలియన్ రైడింగ్ చేస్తూ హెల్మెట్ ధరించలేదు. ఈ ఫొటోను ఓ యూజర్ ట్వీట్ చేసి.. ‘వీరికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్తించవా? వీరు చట్టానికి అతీతులా? వారికి ఫైన్ వేయండి’ అంటూ కామెంట్ చేశారు. బెంగళూరు పోలీసు అధికారులను ట్యాగ్ చేశారు.

Scroll to load tweet…

Also Read: కర్ణాటకలో కొలువుదీరనున్న కాంగ్రెస్ సర్కార్.. మంత్రులుగా 8 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. జాబితా ఇదే..

ఈ ట్వీట్‌కు బెంగళూరు సిటీ ట్రాఫికక్ పోలీసులు స్పందించారు. తాము సరైన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. తాము తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ట్రాఫిక్ సంబంధ ఉల్లంఘనలు రిపోర్ట్ చేయడానికి పబ్లిక్ ఐ అనే పోర్టల్‌ సహకారం తీసుకోవాలని సూచనలు చేశారు. ప్రజలే ట్రాఫిక్ వయలేషన్స్ కట్టడి చేయడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని వివరించారు.