హిందుత్వపై అభ్యంతరకర ట్వీట్.. కన్నడ నటుడు చేతన్ కుమార్ అరెస్టు.. ఏమని ట్వీట్ చేశాడంటే?
హిందుత్వపై అభ్యంతరకర ట్వీట్ చేసిన కన్నడ యాక్టర్ చేతన్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హిందుత్వ మొత్తం అవాస్తవాలే పునాదిగా నిర్మించబడిందని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై ఓ హిందుత్వ అనుకూల సంస్థ ఫిర్యాదు చేయగా.. పోలీసులు చేతన్ అహింసను అదుపులోకి తీసుకున్నారు.

బెంగళూరు: కన్నడ యాక్టర్ చేతన్ కుమార్ హిందుత్వపై చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఆయన ట్వీట్ వైరల్ అయిన తర్వాత బెంగళూరు పోలీసులు చేతన్ కుమార్‌ను అరెస్టు చేశారు. హిందుత్వ అబద్ధపు పునాదుల మీద నిర్మించారని చేసిన ట్వీట్ హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు ఫైల్ చేశారు.
చేతన్ అహింసగా కూడా పిలిచే ఈ యాక్టర్‌ను బెంగళూరులోని శేషాద్రిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దళిత, ట్రైబల్ యాక్టివిస్టు కూడా అయిన యాక్టర్ చేతన్ అహింసను జిల్లా కోరట్ులో హాజరుపరిచారు.
మత విశ్వాసాలను అవమానించారని, కొన్ని వర్గాల మధ్య వైషమ్యాలు తలెత్తేలా ఆయన ట్వీట్ ఉన్నదనే అభియోగాలను యాక్టర్ చేతన్ కుమార్ ఎదుర్కొంటున్నారు.
మార్చి 20న చేతన్ కుమార్ ఓ ట్వీట్ చేశారు. హిందుత్వ పూర్తిగా అవాస్తవాలే పునాదిగా నిర్మించబడిందని పేర్కొన్నారు. ఆ ట్వీట్ ఇలా ఉన్నది.
రావణుడిని రాముడు ఓడించి అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాతే భారత జాతి అనేది మొదలైందని సావర్కర్ చెప్పారనేది ఒక అబద్ధం అని ట్వీట్ చేశాడు. అందులోనే.. బాబ్రీ మసీదే రాముడి జన్మస్థలం అని పేర్కొనడం ఒక అబద్ధం అని, దానికి 1992 సంవత్సరాన్ని రిఫర్ చేశాడు. 2023 సంవత్సరాన్ని పేర్కొంటూ.. ఇప్పుడు టిప్పును అంతమొందించింది ఉరిగౌడా, నంజెగౌడాలు అని చెప్పేదీ అబద్ధమే అని తెలిపాడు. ఇవన్నీ అబద్ధాలే అని చెప్పిన ఆ యాక్టర్ ట్వీట్ చివరలో ఇలా రాశాడు. హిందుత్వను కేవలం నిజం మాత్రమే ఓడించగలదని, ఆ నిజం సమానత్వం అని వివరించాడు.
Also Read: ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ఫారీన్ పార్టీ.. బీజేపీ: ప్రముఖ అమెరికా పత్రికా వాల్‌స్ట్రీట్ జర్నల్
ఈ ట్వీట్ చేయగానే.. గంటల వ్యవధిలోనే ఓ హిందుత్వ అనుకూల సంస్థ అతనికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. శేషాద్రిపురం పోలీసు స్టేషన్‌లో చేతన్ కుమార్ పై కేసు నమోదైంది.
చేతన్ కుమార్ ఇలా చట్టపరమైన సమస్యల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారేమీ కాదు. 2022 ఫిబ్రవరిలోనూ ఆయన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి క్రిష్ణ దీక్షిత్ పై చేసిన అభ్యంతరకర ట్వీట్ కారణంగా అరెస్టు అయ్యాడు. ఆ సమయంలో జస్టిస్ క్రిష్ణ దీక్షిత్ హిజాబ్ కేసులో వానదలు వింటున్నారు.
త్వరలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌లు భారీగా క్యాంపెయిన్లు చేస్తున్నాయి. బీజేపీ నేతలు పలుమార్లు టిప్పు సుల్తాన్‌ను ప్రస్తావించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.