ట్రాఫిక్ సమస్య.. ఏకంగా బస్సు డ్రైవర్ గా మారిన ఏసీపీ..!
ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడుతుందని ఎవరికీ కోసం ఎదురు చూడకుండా ఓ ఏసీపీ రంగంలోకి దిగాడు. ఆయనే స్వయంగా బస్సు నడిపాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

బెంగళూరులో ట్రాఫిక్ సమస్య ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. మాములూగానే అక్కడ విపరీతంగా ట్రాఫిక్ ఉంటుంది. ఒక్క బస్సు ఆగిపోతే, ఇక అక్కడ ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుంది. ఇక, దానిని క్లియర్ చేయడానికి చాలా సమయం పడుతుంది. ఇలాంటి పరిస్థితే అక్కడ ఏర్పడాల్సి రాగా, ఓ ఏసీపీ ఆ పరిస్థితిని కంట్రోల్ చేశారు.
ఓ బస్సు డ్రైవర్ సడెన్ అస్వస్థతకు గురయ్యాడు. అయితే, దాని కారణంగా బస్సు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో, ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడుతుందని ఎవరికీ కోసం ఎదురు చూడకుండా ఓ ఏసీపీ రంగంలోకి దిగాడు. ఆయనే స్వయంగా బస్సు నడిపాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
వీవీఐపీల( ప్రతిపక్ష నేతల సమావేశం షెడ్యూల్ కారణంగా ఓల్డ్ ఎయిర్ పోర్టులో రోడ్డులో ట్రాఫిక్ నిర్వహణ బాధ్యతను ఏసీపీ రామచంద్ర చూసుకుంటున్నారు. ఆకస్మాత్తుగా రూట్ 330 డ్రైవర్ అస్వస్థతకు గురికావడంతో ఆ బస్సును రోడ్డుపై ప్రయాణికులతో సహా నిలిపివేశారు. వెంటనే ఏసీపీ రామ చంద్ర రంగంలోకి దిగారు. అనారోగ్యంతో ఉన్న డ్రైవర్ ను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అనంతరం బస్సు ఆగిపోతే, ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందని ఆయన ఆ సమస్యను పరిష్కరించడానికి ముందుకు వచ్చారు. స్వయంగా తానే బస్సు ను డ్రైవ్ చేసుకుంటూ, కొంత దూరం వెళ్లిపోయారు. దీనిని బస్సులో ఉన్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది. ఏసీపీ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆయన బస్సును వేరే ప్రాంతంలో పార్క్ చేసి,ప్రయాణికులకు మరో సదుపాయం కల్పించారు.