Asianet News TeluguAsianet News Telugu

పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో 90 మందికి కరోనా: మరో 150 మందికి క్వారంటైన్‌కి

కర్ణాటక రాష్ట్రంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో 90 మంది ట్రైనీ పోలీసులకు కరోనా వైరస్ సోకింది. దీంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. బెంగుళూరు సమీపంలోని ధణిసంద్ర పోలీస్ శిక్షణ కేంద్రంలో ఓ కానిస్టేబుల్ కి  ఇటీవల కరోనా సోకింది.

Bengaluru Over 90 trainees at Police Training School test positive for COVID-19
Author
Bangalore, First Published Jul 24, 2020, 4:42 PM IST


బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో 90 మంది ట్రైనీ పోలీసులకు కరోనా వైరస్ సోకింది. దీంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. బెంగుళూరు సమీపంలోని ధణిసంద్ర పోలీస్ శిక్షణ కేంద్రంలో ఓ కానిస్టేబుల్ కి  ఇటీవల కరోనా సోకింది. దీంతో ఈ ట్రైనింగ్ సెంటర్లో పనిచేసే అందరికీ పరీక్షలు నిర్వహించారు.

ఈ ట్రైనింగ్ సెంటర్లో పనిచేసే 90 మంది సిబ్బందికి కరోనా నిర్ధారణ అయినట్టుగా  అధికారులు నిర్ధారించారు. కొత్తగా చేరిన దాదాపు 400 మంది కానిస్టేబుళ్లు శిక్షణ పొందుతున్నారు. ప్రైమరీ కాంటాక్టులో గుర్తించిన మరో 150 మందిని కూడ క్వాంరటైన్ కు పంపనున్నారు. ట్రైనింగ్ స్కూల్ పరిసరాలను శానిటేషన్ చేసినట్టుగా పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. 

also read:ఒక్క రోజులో రికార్డు స్థాయిలో కరోనా కేసులు: ఇండియాలో మొత్తం 12,87,945కి చేరిక

మరోవైపు ట్రైనీ పోలీసుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఉన్నతాధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వెయ్యిమందికిపైగా పోలీసులు కరోనా బారినపడ్డారు. వీరిలో తొమ్మిది మంది మరణించారు. 

దేశంలో శుక్రవారం నాటికి కరోనా కేసుల సంఖ్య 12, 87,945కి చేరాయి. గత 24 గంటల్లో అత్యధికంగా 49వేల కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒక్క రోజులో 49 వేల కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.

Follow Us:
Download App:
  • android
  • ios