నాలుగేళ్ల చిన్నారి పట్ల ఓ దుర్మార్గుడు దారుణంగా ప్రవర్తించాడు. ఇంటి పక్కనే ఉంటూ కాటేశాడు. అభం శుభం తెలియని పసివాడిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన బెంగళూరులో  చోటుచేసుకుంది. కాగా...చిన్నారి  చనిపోయిన 11 నెలల తర్వాత పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే.... బిహార్ కి చెందిన నారద భాగట్... 25 సంవత్సరాల క్రితం బెంగళూరుకి వచ్చి స్థిరపడ్డాడు. రోజు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా.. అతనికి ఇంటి పక్కన ఓ కుటుంబం నివసిస్తోంది. వారికి నాలుగేళ్ల బాలుడు ఉన్నాడు.  కాగా... ఈ ఏడాది జనవరి 1వ తేదీ సాయంత్రం నుంచి బాలుడు కనిపించకుండా పోయాడు. కాగా.. బాలుడి కోసం ఇంటి చుట్టపక్కల మొత్తం గాలించినా ఆచూకీ లభించలేదు. బాలుడిని వెతికే సమయంలో నారద కూడా బాలుడి తల్లిదండ్రుల వెంటే ఉండటం గమనార్హం.

అయితే... .జనవరి 3వ తేదీన బాలుడు ఇంటికి దూరంగా ఉన్న ఓ డంపింగ్ యార్డ్ లో కనిపించాడు. కాగా... బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకోని  దర్యాప్తు చేపట్టారు. అయితే.. బాలుడు కనిపించకుండా పోయినప్పటికీ ఆ చిన్నారిని వెతికే కమ్రంలో నారాద బాలుడి తల్లిదండ్రుల వెంటే ఉన్నాడు. దీంతో పోలీసులకు అతనిపై అనుమానం కలగలేదు.

బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. బాలుడిపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. కేసు దర్యాప్తు కోసం పోలీసులు పలువురిని విచారించగా... నారదపై పోలీసులకు అనుమానం కలిగింది. నారదకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని అంతేకాకుండా.. అతను గే శృంగారం చేస్తాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

AlsoRead పట్టాలపై కూర్చొని మందు పార్టీ.. రైలు ఢీకొని నలుగురు విద్యార్థులు మృతి...

దీంతో పోలీసులు దాదాపు 11నెలల తర్వాత నారదను పట్టుకున్నారు. తొలుత తనకు ఏ పాపం తెలీదని బుకాయించినప్పటికీ తర్వాత నేరం అంగీకరించాడు. నారద... ఓ ఇద్దరు యువకుల నుంచి గంజా కొనుగోలు చేశాడు. ఆ తర్వాత తన గే పార్ట్ నర్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎంత సేపు ఎదురుచూసినా తన కోసం రావాల్సిన పార్ట్ నర్ రాలేదు. ఆ సమయంలో ఇంటి పక్కనే ఆడుకుంటూ బాలుడు కనిపించాడు. దీంతో వెంటనే బాలుడి నోరు మూసి తన ఇంటికి తీసుకువచ్చానని చెప్పాడు.

తాను బాలుడితో శృంగారం చేస్తున్నంతసేపు అతని అరుపులు బయటకు వినపడకుండా ఉండేందుకు నోరు మూసి ఉంచానని చెప్పాడు. తాను పని పూర్తి చేసే సరికి బాలుడు చనిపోయి ఉన్నాడని చెప్పాడు. నేరం అంగీకరించినందుకు పోలీసులు అతనిని పలు సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు.