మెట్రోలో భోజనం చేస్తూ వీడియో... షాకిచ్చిన అధికారులు..!
నిజానికి తనకు లైకుల వర్షం కురుస్తుందని అనుకున్నాడు. కానీ, చివరకు ఆ వీడియోనే అతనికి చిక్కులు తెచ్చి పెట్టింది.

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. దీంతో, తమకు నచ్చిన ప్రతి విషయాన్ని కెమేరాల్లో బందించేస్తున్నారు. తాము చేస్తున్న ప్రతి దానిని ఫోటోలు, వీడియోల రూపంలో తీసుకొని, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి మెట్రో రైల్లో కూర్చొని తినడం మొదలుపెట్టాడు. దానిని వీడియో తీసుకొని హ్యాపీగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. నిజానికి తనకు లైకుల వర్షం కురుస్తుందని అనుకున్నాడు. కానీ, చివరకు ఆ వీడియోనే అతనికి చిక్కులు తెచ్చి పెట్టింది.
బెంగళూరులోని ఓ వ్యక్తి మెట్రోలో భోజనం చేస్తున్న వీడియోను షేర్ చేసినందుకు అతనికి రూ. 500 జరిమానా విధించారు. బెంగుళూరు మెట్రో నిబంధనల ప్రకారం రైళ్లు లేదా ప్లాట్‌ఫారమ్‌లపై భోజనం చేయడం నిషేధించారు. సునీల్ కుమార్, తన స్నేహితులతో కలిసి జయనగర్‌లోని వారి కార్యాలయానికి వెళ్లడానికి సంపిగే రోడ్ నుండి మెట్రో లో వెళ్తున్నాడు. అతను నవ్వుతూ, తన ఆహారాన్ని ఆస్వాదిస్తూ మెట్రోలో భోజనం చేస్తున్న వీడియోను అతని స్నేహితులు చిత్రీకరించారు.
వీడియో బాగుంది కదా అని కుమార్ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు, ఆ తర్వాత బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) మంగళవారం జయనగర్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై నాన్-కాగ్నిజబుల్ రిపోర్టును దాఖలు చేసింది. రూ.500 జరిమానా విధించింది.