భార్యను నడిరోడ్డుపై ఏడుసార్లు పొడిచాడు ఓ వ్యక్తి. అక్కడే ఉన్న ప్రజలు కళ్లప్పగించి చూశారే తప్ప ఆ కిరాతకానికి అడ్డుకునేందుకు ముందుకు రాలేదు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ బయటికి వచ్చింది.
వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ, పెళ్లయిన కొన్ని నెలలకే వాళ్ల ఇష్టాలు అయిష్టాలుగా మారిపోయాయి. ప్రతి చిన్న విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. తాజాగా కుటుంబంలో ఏదో విషయంలో గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన భర్త తన భార్యను పట్టపగలు జనాలు తిరుగుతున్న నడివీధిలో పలుమార్లు కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడిచేశాడు. కానీ, అక్కడ ఉన్న ప్రజలు అతడిని అడ్డుకోకుండా వేడుక చూసినట్టు చూశారు. ఆమెను కాపాడేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. దీంతో భార్యపై అతడు దారుణంగా కత్తితో దాడి కొనసాగించాడు. ఆ దాడిలో ఆమె తీవ్ర గాయాల పాలైంది. ఈ ఘటన ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. బెంగళూరులోని బానసవాడిలో ఈ దారుణం చోటు చేసుకుంది.
బుధవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో దివాకర్ అనే వ్యక్తి పట్టపగలు అందరూ చూస్తుండగా.. తన భార్య నికితపై కత్తితో విచక్షణారహితంగా దాడిచేశాడు. తీవ్రగాయాలైన బాధితురాలు రక్తమడుగులో పడిపోయింది. అనంతరం దివాకర్ తన స్నేహితుడు ప్రదీప్‌తో కలిసి పారిపోయాడు.
ప్రదీప్ ద్విచక్ర వాహనంపై వెళ్లినట్లు సీసీటీవీ కెమెరా ఫుటేజీలో తేలింది. అతను ఉద్దేశపూర్వకంగా వాహనాన్ని వంచి, నికితాను కిందపడిపోయాడు. అకస్మాత్తుగా దివాకర్ బైక్‌పై తప్పించుకునే ముందు ఆమెను చాలాసార్లు పొడిచి చంపడం ప్రారంభించాడు. వీధిలో ఉన్న ప్రజలు నిస్సహాయంగా ఆమె వైపు చూస్తుండగా నికిత రక్తపు మడుగులో పడి ఉంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిఖితను ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు దివాకర్‌ను అరెస్టు చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అతని స్నేహితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.