ట్విస్ట్: భార్య ఫోటో డేటింగ్‌సైట్లో అప్‌లోడ్, షాకిచ్చిన వైఫ్

Bengaluru man posts wife’s obscene   photos, held
Highlights

భార్యకు షాకిచ్చిన భర్త

బెంగుళూరు:భార్యతో ఏర్పడిన విబేధాలతో ఆమెపై కక్ష
తీర్చుకొనేందుకు ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. భార్య
పోటోను వేరే యువకుడితో ఉన్నట్టుగా మార్పింగ్ చేసి
డేటింగ్ సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ ఫోటోతో  పాటు ఆమె
ఫోన్ నెంబర్ కూడ ఇచ్చాడు. పోలీసుల విచారణలో అసలు
విషయం వెలుగు చూసింది.


కర్ణాటక రాష్ట్రంలోని  శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి ప్రాంతానికి
చెందిన వినయ్  ఓ ప్రైవేటు టీవీ చానెల్ లో వీడియో 
ఎడిటరుగా పనిచేస్తున్నారు. 


వినయ్‌కు  తన భార్యతో ఏర్పడిన విబేధాలతో వారు
వేర్వేరుగా నివాసముంటున్నారు. వినయ్ భార్యపై కోపంతో
తనకు దూరంగా ఉంటున్న భార్య ఫోటోతో మరో వ్యక్తి
ఫోటోను ఫోటోషాప్ సహాయంతో జత చేసి దాన్ని డేటింగ్
వెబ్‌సైట్‌లో పోస్టు చేశాడు. 

ఫోటోతో పాటు డేటింగ్ సైట్ లో ఆమె ఫోన్ నంబరు కూడా
ఇచ్చాడు. డేటింగ్ సైట్‌లో ఫోన్ నెంబర్ తీసుకొన్న కొందరు
ఆమెకు ఫోన్ చేసి తమతో గడపాలని ఫోన్లో వేధిస్తున్నారు.
రోజూ వందలాది ఫోన్ కాల్స్ వస్తుండడంతో ఆమె
పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసుల విచారణలో భర్తే  ఆమె ఫోటోను డేటింగ్ సైట్ లో
అప్‌లోడ్ చేశాడని తేలింది. దీంతో వినయ్‌ కుమార్ ను
పోలీసులు అరెస్ట్ చేశారు. 

loader