Asianet News TeluguAsianet News Telugu

గులాబ్ జామూన్ లో బొద్దింక... రూ.55 వేల నష్టపరిహారం..ఐదేళ్ల తరువాత కేసు కొలిక్కి..

బెంగళూరులో ఓ రెస్టారెంట్ లో కస్టమర్ కు jamun bowl లో బొద్దింక వచ్చింది. దీనికి గానూ అతనికి భారీ ఎత్తున నష్టపరిహారం కూడా రాబోతుంది. సదరు రెస్టారెంట్ యజమాని ఇప్పుడు ఈ నష్టపరిహారం చెల్లించలేక లబోదిబో మంటున్నాడు.

bengaluru hotel ordered to pay rs. 55,000 fine after dead cockroach found in jamun bowl
Author
Hyderabad, First Published Oct 8, 2021, 10:05 AM IST

కర్నాటక : బయట ఫుడ్ తినడం వల్ల కొన్నిసార్లు ఆరోగ్యం పాడయ్యే విషయం అందరికీ తెలిసిందే. ఎంత నీట్ గా, జాగ్రత్తగా చేసినా కొన్నిసార్లు ఆహారం కల్తీ అవుతుంటుంది. అది తీవ్ర అనారోగ్యాలకు దారి తీస్తుంది. ఇక పేరొందిన రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల్లో ఆహారపదార్థాల్లో బల్లులు, బొద్దింకలు, పురుగులు వచ్చే ఘటనలు కూడా తెలిసినవే.

ఇలాంటి ఘటనలు అక్కడక్కడా చోటుచేసుకుని వినియోగదారులను భయాందోళనల్లో పడేసేమాట వాస్తవమే. అలాంటిదే ఓ ఘటన కర్ణాటకలో జరిగింది. మామూలుగా సాంబార్ లో బొద్దింకలు రావడం కామన్ అనుకుంటాం. వీటిమీద అనేక జోకులు పేలుతుంటాయి. కార్టూన్లూ వస్తాయి.

అయితే బెంగళూరులో ఓ రెస్టారెంట్ లో కస్టమర్ కు jamun bowl లో బొద్దింక వచ్చింది. దీనికి గానూ అతనికి భారీ ఎత్తున నష్టపరిహారం కూడా రాబోతుంది. సదరు రెస్టారెంట్ యజమాని ఇప్పుడు ఈ నష్టపరిహారం చెల్లించలేక లబోదిబో మంటున్నాడు.

వివరాల్లోకి వెడితే.. 2016లో రాజణ్ణ అనే వ్యక్తి గాంధీనగర్ లోని కామత్ హోటల్ లో గులాబ్ జామూన్ ఆర్డర్ ఇచ్చాడు. రెస్టారెంట్ వాళ్లూ ఎంతో జాగ్రత్తగా సర్వ చేశారు. అయితే అందులో బొద్దింక ఉన్న విషయం వారు గమనించలేదు. తిందామని స్పూన్ పెట్టగానే ఎంచక్కా cockroach.. ఎస్ బాస్ అంటూ పలకరించింది.. అంతే హడలెత్తిన ఆ కస్టమర్.. సిబ్బందికి విషయం చెప్పాడు. 

నెక్స్ట్ టార్గెట్ షారుఖ్ ఖాన్.. ఎన్‌సీబీ తనిఖీలు ఫేక్.. అధికార పార్టీ నేత

గొడవ పెట్టుకుని దాన్ని మొబైల్ లో వీడియో తీయబోయాడు. అయితే రెస్టారెంట్ సిబ్బంది అతడిని వీడియో తీయనీయకుండా మొబైల్ ను లాక్కోబోయారు. దీన్నంతా అతను ఆ రెస్టారెంట్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. అయితే రోజులు గడుస్తున్నా వారినుంచి ఎలాంటి reaction లేదు. దీంతో విసిగిపోయి.. స్థానిక పోలీస్ స్టేషన్ లో, వినియోగదారుల ఫోరంలోనూ కేసులు వేశాడు. 

దీన్ని సీరియస్ గా తీసుకున్న Consumer Forum ఈ కేసు మీద విచారణ చేపట్టింది. మూడేళ్ల తరువాత ఆ restarent owners కి శిక్ష వేసింది. victim రాజణ్ణకు రూ. 55 వేల పరిహారం చెల్లించాలని రెస్టారెంట్ ను ఆదేశించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios