Asianet News TeluguAsianet News Telugu

నెక్స్ట్ టార్గెట్ షారుఖ్ ఖాన్.. ఎన్‌సీబీ తనిఖీలు ఫేక్.. అధికార పార్టీ నేత

షారూఖ్ ఖాన్ తనయుడు అరెస్టయిన ఎన్‌సీబీ తనిఖీల కేసుపై ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తనిఖీలు నకలీవని, అందులో ఎన్‌సీబీకి చెందనివారూ ఉన్నారని, ఓ బీజేపీ నేత, ఓ ప్రైవేటు డిటెక్టివ్ ఉన్నారని తెలిపారు. నెక్స్ట్ టార్గెట్ షారూఖ్ ఖాన్ అని ఆరోపించారు.
 

shahrukh khan son drug case fake says ncp leader nawab malik
Author
Mumbai, First Published Oct 7, 2021, 5:31 PM IST

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయి నుంచి గోవాకు వెళ్తున్న ఓ క్రూయిజ్ షిప్‌లో NCB అధికారులు సోదాలు, అందులో బాలీవుడ్ స్టార్ shahrukh khan తనయుడు aryan khanపట్టుబడటంపై అధికార పార్టీ ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తనిఖీలు అన్నీ ఫేక్ అని అన్నారు. నెక్స్ట్ టార్గెట్ షారూఖ్ ఖానే అని ప్రకటించారు. ఎన్‌సీబీ తనిఖీల్లో బయటి వారి ప్రమేయమూ ఉన్నదని అన్నారు.

ఈ నెల 2న జరిగిన ఎన్‌సీబీ తనిఖీలు అన్నీ నకిలీవని ncp నేత నవాబ్ మాలిక్ అన్నారు. ఆ దాడిలో అసలు మాదక ద్రవ్యాలే లభించలేవని తెలిపారు. ఆర్యన్ ఖాన్ అరెస్టు ఒక ఫోర్జరీ అని ఆరోపించారు. గత నెల రోజులుగా నెక్స్ట్ టార్గెట్ షారూఖ్ ఖాన్ అని క్రైం రిపోర్టర్లకు సమాచారాన్ని పంచుకుంటూ వస్తున్నారని తెలిపారు. అంతేకాదు, ఎన్సీబీ తనిఖీల్లో ఓ బీజేపీ నేత ఉన్నారని ఆరోపించారు. మరో ప్రైవేటు డిటెక్టివ్ కూడా ఉన్నారని వివరించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోనూ ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన పేర్కొన్న వీడియోలో బీజేపీ నేత భానుశాలి, ప్రైవేటు డిటెక్టివ్ గోసావి ఉన్నారు.

 

కాగా, నవాబ్ మాలిక్ ఆరోపణలను ఎన్‌సీబీ ఖండించింది. ఆయన ఆరోపణలు నిరాధారాలని ఎన్‌సీబీ డిప్యూటీ డీజీ గ్యానేశ్వర్ సింగ్ తెలిపారు. ఇది వరకే మొదలైన కొన్ని కేసుల దర్యాప్తుపై బురదజల్లడానికే ఆ వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios