సోషల్ మీడియాలో అపరిచితులతో స్నేహం ప్రమాదకరం, తెలియని వారితో స్నేహం, ప్రేమ కష్టాల్లోకి నెట్టివేస్తుందని పోలీసులు పలుమార్లు హెచ్చరిస్తున్నా.. యువత పట్టించుకోవడం లేదు. తాజాగా సోషల్ మీడియాలో పరిచయమైన ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి ఆరోపించింది. 

సోషల్ మీడియా (social media) వచ్చాక మనుషుల మధ్య దూరం తగ్గింది. దూరపు కొండలు నునుపు అన్నట్టుగా.. ఆన్​లైన్​ మీడియా వల్ల దగ్గర ఉన్నవాళ్లను దూరం పెడుతూ..ముక్కు ముఖం తెలియని వారికి దగ్గరవుతున్నారు. సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలూ ఉన్నాయి. ప్రధానంగా కొంతమంది ఆకతాయిలు అమ్మాయిలను టార్గెట్ చేస్తూ.. ఆన్​లైన్​లో సోషల్ ​మీడియా వేదికగా అమ్మాయిలకు వల విసురుతున్నారు. ప్రేమ పేరుతో వారికి దగ్గరై.. అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటననే బెంగళూరులో చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో పరిచయమైన ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి ఆరోపించింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత బాలిక సోషల్ మీడియా ద్వారా ఆండీ జార్జ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అతడు ఓ పాఠశాలలో డ్యాన్స్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. వారిద్దరూ ఒక సంవత్సరానికి పైగా రీలేషన్ లో ఉన్నారు. ఈ క్రమంలో జార్జ్ నమ్మించి ఆ యువతి లొంగదీసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆ యువతి అతని ఇద్దరు స్నేహితులు సంతోష్, శశి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కానీ ఆ బాధిత యువతి తన పరువు పోతుందని ఆ దారుణాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా తనలోనే దాచుకుంది.

ఇదే అదునుగా భావించినా కామాంధులు బాధితురాలిని తరచూ బ్లాక్‌మెయిల్ చేస్తూ.. అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే..బాధితురాలు జార్జ్‌తో సంబంధాన్ని తెంచుకోవడానికి ప్రయత్నించింది. కానీ, ఆ నిందితులు మాత్రం ఆ యువతిని వీడిచి పెట్టలేదు. తన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను లీక్ చేస్తానని బెదిరిస్తూ.. బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు. దీంతో ఏం చేయాలో తెలియని ఆ బాధితురాలు బెంగుళూర్ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు కొడిగేహళ్లి పోలీసులు నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి, వారి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విచారణ నిమిత్తం స్వాధీనం చేసుకున్నారు.

 ఈ దారుణంపై బెంగళూరు ఈశాన్య విభాగం డీసీపీ లక్ష్మీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కొడిగేహళ్లి పోలీస్‌స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదు చేయబడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, బాధితురాలి మధ్య సంబంధాలు ఉన్నాయి. అయితే.. ఆ యువతిని నమ్మించి .. ప్రధాన నిందితుడు, అతని ఇద్దరు స్నేహితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

నిందితులు ఆమె సన్నిహిత ఫోటోలు, వీడియోలతో ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారని తెలిపారు. బాధితురాలు తన సంబంధాన్ని తెంచుకోవడానికి ప్రయత్నించింది, కానీ, ప్రధాన నిందితుడు ఆమెను బ్లాక్ మెయిల్ చేసి ఒక సంవత్సరం పాటు అత్యాచారం చేశాడనీ, రధాన నిందితుడి స్నేహితులు కూడా బాధితురాలిపై అత్యాచారం చేశారని డీసీపీ ప్రసాద్ తెలిపారు. నిందితులు ఇన్‌స్టాగ్రామ్ పేజీని సృష్టించి, ఫోటోలను అప్‌లోడ్ చేసారని తెలిపారు. వారిపై ఐటి చట్టం కింద కూడా కేసు నమోదు చేసామని డిసిపి ప్రసాద్ తెలిపారు.