Bengaluru: ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్న శివమొగ్గ విమానాశ్రయానికి వ్యతిరేకంగా రైతుల ఆందోళనకు దిగారు. రైతుల భూముల విషయంలో సమస్యలు తెరమీదకు వచ్చాయి. అలాగే, ప్రారంభోత్సవానికి ముందే విమానాశ్రయంలో కన్నడ డిస్ప్లే బోర్డులు లేకపోవడం కన్నడిగుల నుంచి విమర్శలకు తావిస్తోంది. ఏర్పాటు చేసిన డిస్ ప్లే బోర్డుల్లో కేవలం హిందీ, ఇంగ్లిష్ లో మాత్రమే సమాచారం ఉందని కన్నడ ఉద్యమకారులు ట్విటర్ వేదికగా అధికారులపై మండిపడ్డారు.
Kannada Farmers protest: కర్నాటకలో రైతులు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ మరోసారి నిరసనలకు దిగారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్న శివమొగ్గ విమానాశ్రయానికి వ్యతిరేకంగా రైతుల ఆందోళనకు దిగారు. ప్రారంభోత్సవానికి ముందే విమానాశ్రయంలో కన్నడ డిస్ప్లే బోర్డులు లేకపోవడం కన్నడిగుల విమర్శలకు తావిస్తోంది. ఏర్పాటు చేసిన డిస్ ప్లే బోర్డుల్లో కేవలం హిందీ, ఇంగ్లిష్ లో మాత్రమే సమాచారం ఉందని కన్నడ ఉద్యమకారులు ట్విటర్ వేదికగా అధికారులపై మండిపడ్డారు. అలాగే, రైతుల భూముల విషయంలో సమస్యలు తెరమీదకు వచ్చాయి.
వివరాల్లోకెళ్తే.. ఈ నెల 27న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కొత్త శివమొగ్గ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో సేకరించిన భూమికి పరిహారం చెల్లించడంలో అధికారులు విఫలమయ్యారని రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని వ్యతిరేకిస్తూ పలువురు రైతులు డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. విమానాశ్రయ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు ఇచ్చిన హామీ మేరకు అధికారులు పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. "తమ భూముల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగు చేస్తున్నామన్నారు. కానీ ఆ తర్వాత విమానాశ్రయాన్ని నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. పరిహారం వస్తే భూమిని వదులుకుంటామని చెప్పాం. కేఈడీబీకి దరఖాస్తు చేయడం ద్వారా డీసీ మా భూమిని లాక్కోవడానికి ప్రయత్నించారు, దీనిని మేము హైకోర్టులో సవాలు చేశాం" అని ఒక రైతు చెప్పారు.
"హైకోర్టు రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఉత్తర్వులను రద్దు చేసిందన్నారు. 8 మంది రైతులకు రూ.10 కోట్ల పరిహారం జిల్లా కలెక్టర్ కు చేరింది. ఇప్పటి వరకు నష్టపరిహారం సొమ్మును ఇవ్వకుండా రైతులతో చెలగాటం ఆడుతున్నారు" అని పేరు చెప్పడానికి ఇష్టపడని మరో రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముందే ప్రభుత్వం రైతులకు భూమి ఇస్తుందని ఎంపీ బీవై రాఘవేంద్ర తెలిపారు. రైతులకు వీలైనంత త్వరగా నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. ఎయిర్ పోర్టు కోసం భూములు ఇచ్చిన వారికి భూమి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. శివమొగ్గకు 15 కిలోమీటర్ల దూరంలోని సోగానే వద్ద 530 ఎకరాల్లో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. 2008లో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ విమానాశ్రయ నిర్మాణం ప్రారంభమైంది. అయితే 2019లో అధికారంలోకి వచ్చాక పనులు ముమ్మరం చేశారు.
భారత వైమానిక దళ విమానం రాకతో కొత్త విమానాశ్రయంలో విమానాల ట్రయల్ రన్ మంగళవారం ప్రారంభమైంది. విమానాల ట్రయల్ రన్ ప్రారంభమైందని, ఇది రెండు రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఈ నెల 27న ఉదయం 11.15 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణిస్తున్న విమానం చేరుకుంటుందని రాఘవేంద్ర మీడియాకు తెలిపారు. శివమొగ్గకు చెందిన యడ్యూరప్ప సహా పలువురి పేర్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రివర్గం విమానాశ్రయానికి ప్రముఖ కవి, నవలా రచయిత కువెంపు పేరు పెట్టాలని నిర్ణయించింది. కాగా, ప్రారంభోత్సవానికి ముందే విమానాశ్రయంలో కన్నడ డిస్ప్లే బోర్డులు లేకపోవడం కన్నడిగుల నుంచి విమర్శలకు తావిస్తోంది. ఏర్పాటు చేసిన డిస్ ప్లే బోర్డుల్లో కేవలం హిందీ, ఇంగ్లిష్ లో మాత్రమే సమాచారం ఉందని కన్నడ ఉద్యమకారులు ట్విటర్ వేదికగా అధికారులపై మండిపడ్డారు. ఇలాగే చూస్తుంటే కన్నడం ఉనికిలో లేకుండా చూసుకుంటారని, అది అన్ని చోట్లా హిందీని విధిస్తారని మండిపడుతున్నారు. కన్నడిగులు నివసించే శివమొగ్గలో విమానాశ్రయం ఉంది. కానీ బోర్డులన్నీ హిందీ, ఇంగ్లిష్ లో ఉన్నాయి. కన్నడిగులపై హిందీని రుద్దడం ఆపండి అని సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.
