కరోనా రోగి ఇంటికి రేకులతో సీల్: క్షమాపణ చెప్పిన మున్సిపల్ కమిషనర్

కరోనా రోగి ఉన్న కుటుంబం ఇంటి నుండి బయటకు రాకుండా బెంగుళూరు మున్సిపల్ అధికారులు రెండు ప్లాట్లను రేకులతో మూసివేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు చేలరేగాయి. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికుడు సతీష్ సంగమేశ్వరన్ ట్వీట్ చేశారు. 

Bengaluru civic body seals two flats with tin sheets, removes after crticism

బెంగుళూరు:కరోనా రోగి ఉన్న కుటుంబం ఇంటి నుండి బయటకు రాకుండా బెంగుళూరు మున్సిపల్ అధికారులు రెండు ప్లాట్లను రేకులతో మూసివేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు చేలరేగాయి. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికుడు సతీష్ సంగమేశ్వరన్ ట్వీట్ చేశారు. 

ఈ ట్వీట్ కారణంగానే ఈ విషయం వెలుగు చూసింది. తమ బిల్డిండ్ లో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ఈ ఫ్టాట్లలో ఉంటున్నవారిని బయటకు రాకుండా తలుపులకు రేకులతో సీల్ వేశారని ఆయన ఫోన్ లో పోటోలు తీసి మున్సిపల్ అధికారులకు షేర్ చేశాడు.

రెండు ఫ్లాట్లను సీల్ చేసినట్టుగా ఆయన ప్రకటించారు. ఒక ఇంట్లో ఓ మహిళతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారని చెప్పారు. ఈ ఫ్లాట్ పక్కనే ఉండే మరో ఫ్లాట్ లో వృద్ధ దంపతులు నివసిస్తున్నారని సతీష్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ రెండు ఫ్లాట్లను రేకులతో మూసివేశారని... పొరపాటున అగ్ని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. అధికారుల తీరును ఆయన ఎండగట్టారు. 

also read:ఒక్క రోజులో రికార్డు స్థాయిలో కరోనా కేసులు: ఇండియాలో మొత్తం 12,87,945కి చేరిక

కరోనా  రోగుల కుటుంబాలకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందం నిత్యావసర సరుకులను అందించడం కూడ కష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మున్సిపల్ అధికారుల  తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయమై బెంగుళూరు మున్సిపల్ కమిషనర్ మంజునాథ ప్రసాద్ క్షమాపణ కోరారు. 

తమ సిబ్బంది చేసిన పనికి తాను క్షమాపణ చెప్పుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ రెండు ప్లాట్లకు అడ్డుగా ఉంచిన రేకులను వెంటనే తొలగిస్తామని ఆయన చెప్పారు. కరోనా సోకినవారిని కాపాడడంతో పాటు  ఇతరులకు వైరస్ సోకకుడా కాపాడడమే కంటైన్మెంట్ ఉద్దేశ్యమన్నారు. స్థానిక సిబ్బంది అత్యుత్సాహం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios