Asianet News TeluguAsianet News Telugu

ఆసియా ఖండంలో ఎక్కువ మంది మాట్లాడే రెండో భాష బెంగాలీ: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బెంగాలీ భాష గొప్పతనం గురించి ఈ రోజు కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఆసియా ఖండంలోనే ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో బెంగాలీ రెండోదని ఆమె అన్నారు. 
 

bengali is second largest spoken language in asia continent says west bengal cm mamata banerjee
Author
First Published Jan 27, 2023, 4:09 AM IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రిపబ్లిక్ డే సందర్భంగతా బెంగాల్ గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్ హాతె ఖోరి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం మమతా బెనర్జీ హాజరయ్యారు. ఇక్కడ బెంగాలీ భాష గురించి మాట్లాడారు. ఆసియా ఖండంలోనే ఎక్కువ మంది మాట్లాడే రెండో భాష బెంగాలీ అని అన్నారు. అంతేకాదు, ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషల జాబితాలో బెంగాలీది ఐదో స్థానం అని వివరించారు. 

ఎక్కడున్నా.. ఎక్కడ జీవిస్తున్నా మాతృభాషను నేర్వడం మరువద్దు అంటూ సూచనలు చేశారు. అంతేకాదు, బెంగాలీ భాషపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్న పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. గవర్నర్ ఆనంద బోస్ కోల్‌కతాలోని రాజ్ భవన్‌లో హాతే ఖోరి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం మమతా బెనర్జీ హాజరయ్యారు.

Also Read: పార్లమెంటులో రేవంత్ రెడ్డి వర్సెస్ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. ‘నేను శూద్రుడిని అందుకే.. ’

డాక్టర్ సీవీ ఆనంద్ బోస్ బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు తీసుకోవడానికి ముందు రాష్ట్ర గవర్నర్‌గా ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ బాధ్యతలు  నిర్వర్తించిన సంగతి తెలిసిందే. జగదీప్ ధన్కడ్ బెంగాల్ గవర్నర్‌గా ఉన్న కాలంలో రాష్ట్ర రాజకీయాలపై తనవైన కామెంట్లు వేడిగా, వాడిగా చేసేవారు. గవర్నర్, సీఎం మధ్య సఖ్యత చాలా తక్కువగా ఉండేది. బహిరంగంగా విమర్శలు చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios