Asianet News TeluguAsianet News Telugu

'వర్క్ ఫ్రమ్ హోమ్' అంటే ఇదేనేమో.. పెళ్లి మండపంలో ల్యాప్‌టాప్‌తో బిజీబిజీగా ఉన్న వరుడు.. 

కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోయింది. మరోవైపు ఆఫీస్ వర్కింగ్ స్టైల్‌లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఆధిపత్యంగా మారింది. కరోనా తర్వాత చాలా కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగుతోంది.ఇంతలో పెళ్లి ఆచారాల మధ్య ల్యాప్‌టాప్‌లో ఆఫీసు పని చేస్తున్న వరుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Bengali groom works on laptop during wedding. Viral pic has raised several questions
Author
First Published Nov 29, 2022, 6:14 PM IST

పెళ్లి అనేది జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వేడుక.. ఈ వేడుకను కలకాలం గుర్తు ఉండిపోయేలా చేసుకోవాలని భావిస్తారు. ఇక దేశంలో పెళ్లిళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే.. భారతీయుల పెళ్లిల్లో డబ్బును నీళ్లలా ఖర్చు పెడుతున్నారు.  ఏ మాత్రం ఖర్చుకు వెనుక ఆడకుండా భారీ ఎత్తున వివాహ వేడుకలను నిర్వహిస్తారు.పెద్ద మొత్తంలో ఖర్చు చేసి బంధు,మిత్రులకు విందు, వినోదాన్ని అందిస్తారు. ఇక పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితుల పెళ్లిసందడి  మామూలుగా ఉండదు. ఇందంతా కరోనా ముందుకు పరిస్థితి..

కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోయింది. మరోవైపు ఆఫీస్ వర్కింగ్ స్టైల్‌లో కూడా మార్పు వచ్చింది..  వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఆధిపత్యం చేలాయిస్తుంది. కరోనా తర్వాత చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఉద్యోగులకు సెలవులు దొరకడం చాలా కష్టంగా మారింది. కనీసం పెళ్లి ఉన్న లీవ్ దొరకని పరిస్థితి.. తాజాగా నెట్టింట్లో ఓ  వరుడి ఫోటో వైరల్ అవుతోంది. ఓ వరుడు.. తన వివాహతంతులో కూర్చున్నాడు. కానీ.. తనకు ఏం సంబంధం లేదు అన్నట్టుగా.. ఆఫీస్ వర్క్ లో చాలా బీజీగా బీజీగా ఉన్నాడు. చదువుతుంటేనే చాలా వింతగా ఉంది కదా..

ఈ ఫోటోను మొదటగా శ్రీమోయీ దాస్ అనే వ్యక్తి తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. ఫోటోను షేర్ చేస్తూ 'వర్క్ ఫ్రమ్ హోమ్' మిమ్మల్ని వేరే స్థాయికి తీసుకెళ్తున్నప్పుడు!మండపంలో పెళ్లికొడుకుగా కూర్చున్నా .. ల్యాప్‌టాప్‌లో పని చేయాల్సిందే.. అని రాసుకొచ్చారు. ఆ తర్వాత ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది.  శ్రీమోయి కథనం ప్రకారం.. ఆ ఫోటోలో కనిపిస్తున్న వరుడు అతని సోదరుడు. ఈ ఫోటో చూసిన తర్వాత యూజర్ల కోపం ఆకాశానికి అంటుతోంది. ఇది ఇప్పటివరకు 10,000 కంటే ఎక్కువ లైక్‌లు రాగా.. వందలాది కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో  కామెంట్ల వర్షం కురుస్తోంది. 

ఈ వరుడిని చూస్తే.. గుండె తరుక్కుపోయిందని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరో నెటిజన్ .. ఇదే అసలైన వర్క్ ఫర్ ఓమ్ అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరూ.. ఈ పని సరికాదని చెప్పారు. మరికొందరూ .. ప్రస్తుత పరిస్థితిలో ఉద్యోగాలు తమ ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ఏమైనా చేయాల్సిందేననీ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు..'వర్క్ ఫ్రమ్ హోమ్' సంస్కృతిని విషపూరితంగా చేస్తుందని.. ఈ దృశ్యాన్ని చూస్తే.. అర్థమవుతోందని అని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఈ చిత్రంలో తమను తాము చూసుకుంటున్నామని అంటున్నారు. కోవిడ్ నుండి ఉద్యోగాలు సంక్షోభం పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అనడానికి ఈ ఫోటోనే నిదర్శనం. 

Follow Us:
Download App:
  • android
  • ios