Bengal SSC Scam : అర్పితా ముఖర్జీ ఫ్లాట్ లో సెక్స్ టాయ్స్, వెండి గిన్నెలు లభ్యం.. షాక్ అయిన అధికారులు
అర్పితా ముఖర్జీ ప్లాట్ లో లభ్యమైన వస్తువులను చూసి ఈడీ అధికారులు ఖంగుతిన్నారు. లైంగిక అవసరాలకు ఉపయోగించే సెక్స్ టాయ్స్, బెంగాల్ ప్రాంతంలో కొత్తగా పెళ్లయిన జంటలకు అందించే వెండి గిన్నెలు ఆమె ఇంట్లో దొరికాయి. అవి అక్కడ ఎందుకు ఉన్నాయనే విషయంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పశ్చిమ బెంగాల్‌లో టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత మమత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పార్థ ఛటర్జీ, అతడి సన్నిహితురాలు అర్పితా ఛటర్జీ విషయంలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఆమె ఇంటి నుంచి ఈడీ భారీ మొత్తంలో రికవరీ అయిన డబ్బు కట్టల ఫొటోలు నెట్ లో వైరల్ అయ్యాయి. వీటితో పాటు అధికారులు బంగారు నగలు, అనేక విలువైన వస్తువులు రికవరీ చేశారు. ఈ స్కామ్ దేశం మొత్తం సంచలనంగా మారింది.
యావత్ ప్రపంచం భారత యువత వైపు చూస్తోంది: ప్రధాని మోడీ
అయితే ఈడీ తన విచారణను వేగవంతం చేసింది. విచారణలో భాగంగా ఉన్నతాధికారులు షాకింగ్ దృష్యాలను చూశారు. ఉన్నత వర్గాల సమాచారం మేరకు అర్పిత ఫ్లాట్ నుండి అనేక సెక్స్ టాయ్స్ లభ్యం అయ్యాయి. అయితే వాటిని అక్కడికి తీసుకొచ్చింది ఎవరు? వాటి ఉపయోగం ఏమిటి ? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఆ ప్లాట్ లో వెండి గిన్నెలు కూడా లభించాయి. కానీ అవి పెద్దగా ఖరీదైనవేమీ కావు. అయితే ఆ ప్రాంతంలో వెండి గిన్నెలకు మరో సామాజిక కోణం కూడా ఉంది. బెంగాలీలలో కొత్తగా పెళ్లయిన జంటకు వెండి గిన్నె ఇస్తుంటారు. ఇది అక్కడ సంప్రాదాయంగా వస్తున్న పద్దతి. ఈ గిన్నెల్లో దీపం వెలిగించడం ద్వారా రాబోయే తరాన్ని ప్రపంచం ముందుకు తీసుకురావాలని ఆకాంక్షించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఇలాంటి గిన్నెలు అర్పిత ప్లాట్ కు ఎందుకు వచ్చాయో అర్థం కావడం లేదు.
సెక్స్ టాయ్‌కు సంబంధించిన అంశంలో అర్పితను విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించారు. ఆ టాయ్స్ ఆమెకు ఎవరు ఇచ్చారు? ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిందా ? దాన్ని కొనడానికి కారణం ఏమిటి ? అనే ప్రశ్నలకు ఈడీకి అధికారులకు తలెత్తుతున్నాయి. కాగా సాధారణంగా వీటిని లైంగిక అవసరాల కోసం వీటిని కొనుగోలు చేస్తుంటారు. వీటిని కొనే వారిలో చాలా మందికి లైంగిక భాగస్వామి ఉండరు. కాబట్టి వీటి ద్వారా వారు లైంగిక ఆనందం పొందుతారు. దీనిపై విచారణ జరిపితే అర్పితా-పార్థ ఛటర్జీకి సంబంధించిన మరిన్ని విషయాలు బయటకు రావొచ్చని అధికారులు భావిస్తున్నారు.
రన్ వే నుంచి జారిన విమానం, బురదలో కూరుకుపోయిన చక్రం.. తృటిలో తప్పిన పెనుప్రమాదం..
ఇదిలా ఉండగా.. నటి శ్రీలేఖ మిత్ర దీనిపై స్పందించింది. మాజీ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు
అర్పితా ముఖర్జీ ఫ్లాట్ నుండి స్వాధీనం చేసుకున్న వార్తలకు సంబంధించిన అనేక వార్తల స్క్రీన్‌షాట్ లను ఆమె షేర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. పార్థ ఛటర్జీ, అర్పితా ను ఉద్దేశించి వ్యంగంగా కామెంట్స్ చేశారు. కాగా ఈ కేసు బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఇబ్బందుల్లోకి నెట్టింది. సీఎం మమతా బెనర్జీ టార్గెట్‌గా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు దోషులుగా తేలితే బాధ్యుతలపై చర్యలు తీసుకోవాలని మమతా బెనర్జీ ఇదివరకే చెప్పారు. టీఎంపీపై బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.