MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • నాతోనే ఆడుకుంటావా, ఇకపై నాకు కనిపించకు, తనను డామినేట్ చేసిన నటుడిని బ్యాన్ చేసిన ఎన్టీఆర్! ఎవరా నటుడు?

నాతోనే ఆడుకుంటావా, ఇకపై నాకు కనిపించకు, తనను డామినేట్ చేసిన నటుడిని బ్యాన్ చేసిన ఎన్టీఆర్! ఎవరా నటుడు?

ఒక నటుడిని జూనియర్ ఎన్టీఆర్ నాలుగైదేళ్లు కనబడకు అని తిట్టి బ్యాన్ చేశాడట. తనను ఓ సినిమాలో ఆయన డామినేట్ చేయడమే కారణం అట. ఆ నటుడు ఎవరో చూద్దాం  

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 16 2024, 11:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ తరం టాలీవుడ్ గ్రేట్ యాక్టర్స్ లో ఎన్టీఆర్ ఒకరు. ఆయన మంచి నటుడే కాదు గొప్ప డాన్సర్. అలాగే సింగర్ కూడాను. ఎన్టీఆర్ అద్భుతమైన నటుడని చాలా మంది సీనియర్ నటులు ఓపెన్ గానే చెప్పారు. అయితే ఎన్టీఆర్ నే ఒక నటుడు డామినేట్ చేశాడట. అందుకు ఆయన నొచ్చుకున్నాడట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో ఎన్టీఆర్ హీరో కాగా జగపతిబాబు విలన్. కరుడుగట్టిన ఫ్యాక్షనిస్ట్ గా జగపతిబాబు పాత్ర ఉంటుంది. ఇక ఎన్టీఆర్ సైతం ఫ్యాక్షనిస్ట్ అయినప్పటికీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. ఆయన నటన సెటిల్డ్ గా ఉంటుంది. దర్శకుడు త్రివిక్రమ్ ఫ్యాక్షనిజంలో ఎన్టీఆర్ హీరోయిజం కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. 

36

అయితే తన పాత్ర కంటే జగపతిబాబు చేసిన బసిరెడ్డి పాత్ర గొప్పగా ఉందని ఎన్టీఆర్ అనేవాడట. జగపతిబాబును రోజూ తిట్టేవాడట. ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు మాట్లాడుతూ... అరవింద సమేత చిత్రంలో నాది ఎక్స్ట్రా ఆర్డినరీ రోల్. కథకు బాగా వర్క్ అవుట్ అయ్యింది. దురదృష్టవశాత్తు నాది అగ్రెసివ్ క్యారెక్టర్, తారక్ పాసివ్ క్యారెక్టర్ చేశారు. 

అందుకే నా పాత్ర బాగా వచ్చింది. అసలు తారక్ వంటి స్టార్ హీరో అలాంటి యాటిట్యూడ్ తో కూడిన క్యారెక్టర్ ఒప్పుకోవడమే కష్టం. అయితే దానికి సరిపడా శిక్ష నాకు తారక్ విధించాడు. రోజూ రాత్రి వాయించేసేవాడు. నువ్వు నన్ను ఇట్లా చేస్తున్నావ్ అట్లా చేస్తున్నావ్, నీ క్యారెక్టర్ బాగుంది అని తిట్టేవాడు. అవన్నీ ఓకే. అంటే ప్రేమగానే తిట్టేవాడు. 
 

46
Jagapathi Babu

Jagapathi Babu

అరవింద సమేత ప్రీ రిలీజ్ వేడుకలో కూడా తారక్... ఫస్ట్ బసిరెడ్డి గుర్తుంటాడు. తర్వాత నేను గుర్తుంటాను అని స్వయంగా అన్నాడు. అంత పెద్ద హీరో అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడమే సాహసం. తర్వాత నాతో.. బాబు ఇక మీకు నాకు అయిపోయింది. మీరు తారక్ తోనే ఆడుకుంటున్నారు. అది కుదరదు. ఓ నాలుగైదేళ్లు నాకు కనిపించకండి అన్నాడు.. అని చెప్పుకొచ్చారు. 

56
Aravinda Sametha

Aravinda Sametha

ఇప్పట్లో తన సినిమాల్లో మీరు నటించవద్దని ఎన్టీఆర్ పరోక్షంగా చెప్పాడని జగపతిబాబు వెల్లడించారు. అరవింద సమేత వీరరాఘవ 2018లో విడుదలైంది. ఈ ఆరేళ్లలో ఎన్టీఆర్ నటించింది రెండు చిత్రాలు మాత్రమే. ఒకటి ఆర్ ఆర్ ఆర్ కాగా, మరొకటి దేవర. ఈ రెండు చిత్రాల్లో జగపతిబాబు నటించలేదు. 

 

66

ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న మల్టీస్టారర్ ఈ చిత్రం. వార్ 2 అనంతరం ప్రశాంత్ నీల్ తో మూవీ చేస్తారు. దీనిపై అధికారిక ప్రకటన జరిగింది. అలాగే దేవర 2 మూవీ ఎన్టీఆర్ పూర్తి చేయాల్సి ఉంది. దేవర 2 ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Recommended image2
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Recommended image3
Rajinikanth Net Worth : తలైవా ఆస్తి ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved