Bengal man chops off wife's hand: పశ్చిమ బెంగాల్‌లో ఉద్యోగం వచ్చిందని ఓ వ్యక్తి తన భార్య చేయి నరికేశాడు. ఆ వ్యక్తి తన భార్య తీరుపై అనుమానంతోనే ఈ దారుణానికి పాల్పడ్డడని సమాచారం. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు.
Bengal: భార్యకు ఉద్యోగం వచ్చిందని ఓ భర్త తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమె చేయిన నరికాడు. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ దారుణానికి ఒడిగట్టిన భర్త పరారీలో ఉన్నాడు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకెళ్తే.. నర్సుగా ఉద్యోగం రావడంతో భార్య చేయి నరికేశాడు ఓ భర్త. పదునైన ఆయుధంతో భార్య కుడి చేతిని మణికట్టు కింద నుంచి నరికేశాడు. తీవ్రంగా గాయపడిన భార్య రేణు ఖాతున్ పశ్చిమ బుర్ద్వాన్‌లోని దుర్గాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన తూర్పు బుర్ద్వాన్‌లోని కేతుగ్రామ్‌లో చోటుచేసుకుంది. భార్యపై నెలకొన్న అనుమానంతోనే ఈ దారుణానికి ఒడికట్టినట్టు సమాచారం. అతని భార్యకు నర్సుగా ఉద్యోగం వచ్చిన తర్వాత నుంచి ఆ వ్యక్తి తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తనను వదిలిపెడుతుందేమోనని భయపడుతుండే వాడు.
బాధితురాలు రేణు ఖాతూన్ ఇటీవల ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం సంపాదించింది. ఖాతూన్ తన ఉద్యోగానికి వెళ్లడం ప్రారంభించిన వెంటనే, ఆమె భర్త మహ్మద్ షేక్‌కి ఆమె పట్ల అభద్రతాభావం మరియు అనుమానం పెరిగింది. ఆమె తన కార్యాలయంలో ఉన్న మరొక వ్యక్తి కోసం తనను విడిచిపెడుతుందని అతను నమ్మాడు. ఈ క్రమంలోనే తన స్నేహితునితో కలిసి భార్య చేయి నరికాడు. ముందుగా ఆమె చేతులను దిండుతో అదిమిపట్టుకుని.. పదునైన కత్తితో చేయి నరికాడు. ఖాతూన్ ను మొదట బర్ధమాన్‌లోని ప్రథమ చికిత్స కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ నుండి ఆమె తీవ్ర గాయాల కారణంగా దుర్గాపూర్‌లోని ఒక ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌కు తరలించారు.
చాలా కాలం నుంచి నర్సింగ్ లో చేరాలని ఖాతూన్ కలలు కనింది. ఈ క్రమంలోనే కలకత్తాలో నర్సింగ్ పూర్తి చేసింది. పెండ్లి తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కష్టపడి చదివింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకున్న రేణు కల నెరవేరింది. ప్రభుత్వ ఉద్యోగాల ప్యానల్ లిస్టులో భార్య పేరు చూసి.. ఆమెను ఉద్యోగంలో చేరనివ్వకూడదని భర్త షేర్ మహ్మద్ ప్లాన్ చేశాడు. జూన్ 4వ తేదీ రాత్రి, కోజల్సా గ్రామంలోని తన ఇంటిలో, షేర్ మహ్మద్ మరియు అతని ఇద్దరు సహచరులు నిద్రిస్తున్న రేణు ముఖంపై దిండు వేసి, పదునైన ఆయుధంతో ఆమె కుడి మణికట్టును నరికివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రేణు ఖాతున్ తండ్రి అజీజుల్ హక్ మాట్లాడుతూ.. 'నా కూతురి కల చెదిరిపోయింది. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను అని అన్నారు. ఇదిలా ఉంటే, రేణు ఖాతున్ తాత రిపన్ షేక్ మాట్లాడుతూ, 'షేర్ మహ్మద్ తన సోదరి పని చేయాలని ఎప్పుడూ కోరుకోలేదు. తన చెల్లికి ఉద్యోగం వచ్చిందని షేర్ మహ్మద్ అంగీకరించలేకపోయాడు. అందుకే ఈ నీచమైన పనికి పాల్పడ్డాడు అని తెలిపాడు.
