బెంగాల్ జిహాద్ ఫ్యాక్టరీ: లడ్డూ షాప్ వెనక ఆయుధాల ఫ్యాక్టరీ(వీడియో)

Behind laddu shop is arms manufacturing unit with suspected links to Jamat
Highlights

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కత్తా సమీపంలో తినుబండారాల తయారీ పేరుతో గుట్టుగా అక్రమ ఆయుధాలను తయారు చేస్తున్న ముఠాను ఎస్ఎఫ్ఎఫ్ భద్రతా సిబ్బంది గుర్తించారు. అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉండే రాజధాని నగరానికి అతి సమీపంలో ఈ అక్రమ ఆయుధాల తయారీ వ్యవహారం బైటపడటం భద్రతా పరంగా ఆందోళన కలిగిస్తోంది.   

ఓ వైపు రాష్ట్రంలో అంతకంతకు పెరిగిపోతున్న అక్రమ బంగ్లాదేశీ వలసలు, రోహింగ్యాల చొరబాట్లపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో అక్రమ వ్యవహారాలపై ఉక్కు పాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా ఉంచిన భద్రతా సిబ్బంది కలకత్తా సమీపంలోని కాకినార సమీపంలో అక్రమ ఆయుధ తయారీ ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠాకు బంగ్లాదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు, వారికి సరఫరా చేయడానికే ఇలా అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలు తయారుచేస్తున్నట్లు గుర్తించారు. స్వీట్ షాప్ మాటున ఈ వ్యవహారం నడుస్తున్నట్లు గుర్తించి దాడి చేసినట్లు ఎస్ఎఫ్ఎఫ్ అధికారులు తెలిపారు. 

వీడియో

loader