Asianet News TeluguAsianet News Telugu

జవాన్ల త్యాగం వృథాపోదు.. మావోలకు ధీటుగా బదులిస్తాం: అమిత్ షా హెచ్చరిక

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల మారణకాండపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రక్తపాతాన్ని సృష్టించడాన్ని సహించేది లేదని నక్సల్స్‌కు సరైన సమయంలో దీటైన సమాధానం ఇస్తామని హెచ్చరించారు

Befitting reply to Chhattisgarh Naxal attack will be given at appropriate time says Amit Shah ksp
Author
Chhattisgarh, First Published Apr 4, 2021, 7:07 PM IST

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల మారణకాండపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రక్తపాతాన్ని సృష్టించడాన్ని సహించేది లేదని నక్సల్స్‌కు సరైన సమయంలో దీటైన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్సాంలో పర్యటిస్తోన్న అమిత్‌ షా.. ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఆయన హుటాహుటీన ఢిల్లీకి ప్రయాణమయ్యారు.  

బీజాపూర్‌, సుకుమా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జవాన్లతో పాటు మావోయిస్టుల వైపు ప్రాణనష్టం సంభవించిందని అమిత్ షా పేర్కొన్నారు. అయితే, ఇప్పటివరకు ఎంత మంది ప్రాణాలు కోల్పోయారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉందన్నారు.

గల్లంతైన జవాన్ల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు అమిత్‌ షా వెల్లడించారు. అమరులైన జవాన్ల త్యాగాలు ఎన్నటికీ వృథా పోవని ఆయన స్పష్టం చేశారు. అస్సాంలోని ఎన్నికల ప్రచారంలో ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి హిమంతా బిస్వాకు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు.

Also Read:ఛత్తీస్‌ఘడ్ సీఎంకు అమిత్ షా ఫోన్: సీఆర్‌పీఎఫ్ డీజీకి కీలక ఆదేశం

అయితే, ప్రచార సభలో మాట్లాడకుండానే కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి బయలుదేరిన హోంమంత్రి, ఎన్‌కౌంటర్ పరిణామాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.  

ఇక అధికారుల సమాచారం ప్రకారం, ఎన్‌కౌంటర్‌లో మొత్తం 24మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 24 మంది జవాన్లను ఇప్పటికే గుర్తించినట్లు పోలీసుల అధికారులు వెల్లడించారు. మృతుల్లో 9 మంది కోబ్రా సిబ్బంది, 8 మంది డీఆర్జీ సిబ్బంది, 6గురు ఎస్పీఎఫ్‌, బస్తర్‌ బెటాలియన్‌ జవాన్‌లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios