రాయ్‌పూర్: రాష్ట్రంలో మావోయిస్టుల కాల్పుల్లో 22 మంది జవాన్లు మరణించిన ఘటన తర్వాత ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ బఘేల్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు.

శనివారం నాడు బీజాపూర్ జిల్లాలో రెండు గుట్టల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ లో 22 మంది జవాన్లు మరణించారు. మరో 31 మందికి పైగా గాయపడ్డారు. 25 జవాన్లు ఆచూకీ లేకుండా పోయింది. అయితే ఏడుగురు జవాన్ల ఆచూకీ దొరకడం లేదని అధికారులు ప్రకటించారు.

సీఆర్‌పీఎఫ్ డీజీపీని రాష్ట్రంలో పర్యటించాలని కేంద్ర హోంమంత్రి సీఆర్‌పీఎఫ్ డీజీపీ కుల్‌దీప్ సింగ్ ను ఆదేశించారు.  రాష్ట్రంలో పరిస్థితిపై  ఛత్తీస్‌ఘడ్ సీఎం తో అమిత్ షా చర్చించారు. ఈ ఎన్ కౌంటర్ తర్వాత తీసుకొన్న చర్యలపై  సీఎం కేంద్ర మంత్రికి వివరించారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో జవాన్లు మరణించిన ఘటనపై  ట్విట్టర్ లో అమిత్ షా మృతులకు సంతాపం తెలిపారు. అమరుల శౌర్యాన్ని దేశం ఎప్పటికీ  మరిచిపోదన్నారు. శాంతికి విఘాతం కల్గించే శక్తులపై తమ పోరాటం కొనసాగిస్తామన్నారు.