Asianet News TeluguAsianet News Telugu

బీర్‌ల ట్రక్కు బోల్తా.. బీర్‌ల కోసం ఎగబడ్డ స్థానికులు.. షాక్‌లో పోలీసులు

తమిళనాడులో బీర్ బాటిళ్లతో వెళ్లుతున్న ఓ ట్రక్కు సోమవారం బోల్తా పడింది. దీంతో ఆ ట్రక్కులో నుంచి బీర్ కాటన్లు.. అందులో నుంచి బీర్ బాటిళ్లు బయటపడ్డాయి. వాటిని జేసీబీతో తొలగిస్తుండగా స్థానికులు విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. నాలుగైదు బాటిళ్లు చేతిలో పట్టుకుని వెళ్లిపోయారు.
 

beer bottle truck overturns, local chased for beer bottles kms
Author
First Published May 2, 2023, 8:16 PM IST

చెన్నై: తమిళనాడులో ఓ బీర్ ట్రక్కు బోల్తా పడింది. ట్రక్కులో నుంచి బీర్ కాటన్లు బయటపడ్డాయి. ఆ కాటన్‌ల నుంచి బీర్‌లు బయటపడి చాలా వరకు పగిలిపోయాయి. రోడ్డు పక్కనే బీర్‌ పానీయం దారలుగా పోయింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు స్పాట్‌కు పరుగులు తీశారు. చేతిలో వీలైనన్ని బీర్ బాటిళ్లు పట్టుకుని తీసుకెళ్లారు.

తమిళనాడులోని బందరపల్లి ఫ్లై ఓవర్ వద్ద బీర్‌లను మోసుకెళ్లుతున్న ట్రక్కు సోమవారం బోల్తా పడింది. ఆ ఫ్లై ఓవర్ వద్ద ట్రక్కు పై డ్రైవర్‌కు నియంత్రణ కోల్పోయింది. ఫ్లై ఓవర్ వద్దే బోల్తా పడింది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కు వెళ్లారు. రోడ్డు పక్కనే బీర్ బాటిళ్లు, కాటన్‌లతో చిందరవందరగా మారిపోయింది. దీంతో పోలీసులు ఆ కాటన్లు, బీర్లను తొలగించడానికి జేసీబీని స్పాట్‌కు తీసుకువచ్చారు.

Also Read: జగన్‌తో ముగిసిన బాలినేని భేటీ : కో ఆర్డినేటర్ పదవి, జిల్లాలో రాజకీయాలపై చర్చ.. మెత్తబడని శ్రీనివాస్ రెడ్డి

జేసీబీ వాటిని అన్నింటిని పక్కకు నెట్టేయడానికి ఉపక్రమిస్తుండగా.. స్థానికులు స్పాట్‌కు వచ్చారు. పరుగులు పెట్టుకుంటూ వచ్చి చేతిలో నాలుగైదు బీర్ బాటిళ్లు పట్టుకుని బయటపడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు వారి తీరును చూసి షాక్ అయ్యారు. వారిని వారించలేక షాక్‌లో ఉండిపోయారు. క్షణాల్లో అక్కడ పగలకుండా ఉన్న బీర్‌ బాటిళ్లను తీసుకుని వెళ్లిపోయారు. జేసీబీ అక్కడ మిగిలి ఉన్న చెత్తను తొలగించింది. 

ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు కాపాడారు. సమీప హాస్పిటల్‌కు చికిత్స కోసం తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios