మేఘాలయ గవర్నర్‌గా బిడి మిశ్రా మంగళవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా కూడా ఉన్నారు.

మేఘాలయ కొత్త గవర్నర్‌గా బిడి మిశ్రా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. మంగళవారం ఆ రాష్ట్ర రాజ్‌భవన్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేశారు. భారత ఆర్మీ మాజీ బ్రిగేడియర్ అయిన మిశ్రా 2017 నుండి అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. అయితే ఆయ‌నకు పొరుగున ఉన్న మేఘాలయ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గా కూడా కేంద్రం అద‌న‌పు బాధ్యత‌లు అప్ప‌గించింది. 

కారుణ్య నియామ‌కం హ‌క్కు కాదు.. ఒక రాయితీ మాత్ర‌మే - సుప్రీంకోర్టు

అంతకు ముందు మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ గా సత్యపాల్ మాలిక్ ప‌ని చేశారు. అయితే ఆయ‌న ప‌ద‌వీకాలం అక్టోబరు 3తో ముగిసింది. దీంతో నేడు ఆయ‌న నుంచి మిశ్రామ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ మెత్బా లింగ్డో, సీనియర్ కేబినెట్ మంత్రులు పాల్గొన్నారు. కాగా.. మేఘాలయ సీఎం కాన్రాడ్ కె సంగ్మా రాష్ట్రానికి కొత్త గవర్నర్‌కు స్వాగతం పలికారు.

Scroll to load tweet…

‘‘ మేఘాలయ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన బిడి మిశ్రాకు అభినందనలు, శుభాకాంక్షలు. ఆయ‌న స‌ల‌హా, మద్దతు మేము ఎదురుచూస్తున్నాం. మా అంద‌మైన రాష్ట్రానికి ఆయ‌న‌ను స్వాగతిస్తున్నాం’’ అని ఆయన ట్వీట్ చేశారు.