భారతదేశంలో పని చేసే ఆ సంస్థలైనా ఇక్కడి చట్టాలను పాటించాల్సిందే అని విదేశాంగ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. నేటి ఉదయం యూకే విదేశాంగ మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో జై శంకర్ ఈ విషయాన్ని తెలియజేశారు. 

బీబీసీ కచ్చితంగా భారతీయ చట్టాలను పాటించాల్సిందే అని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అన్నారు. రెండు రోజుల పాటు భారత్ లో జరగనున్న జీ20 దేశాల విదేశాంగ మంత్రుల కీలక సమావేశానికి హాజరయ్యేందుకు మన దేశానికి వచ్చిన యునైటెడ్ కింగ్‌డమ్ విదేశాంగ కార్యదర్శి జేమ్స్ క్లీవర్లీ తో జైశంకర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బుధవారం ఉదయం వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేమ్స్ తెలివిగా బీబీసీ ఆఫీసుపై జరుగుతున్న ట్యాక్స్ సెర్చ్ సమస్యను లేవనెత్తారు. దీనికి ప్రతిస్పందనగా ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తూ భారత్ లో పని చేస్తున్న అన్ని సంస్థలూ పూర్తిగా సంబంధిత చట్టాలు, నిబంధనలకు పూర్తిగా కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పారు. 

ఉమేష్ పాల్ హత్య కేసు.. ప్రయాగ్‌రాజ్‌లోని నిందితుల ఇళ్లను కూల్చివేసిన యోగి ప్రభుత్వం

‘‘భారత్‌లో పనిచేస్తున్న అన్ని సంస్థలు సంబంధిత చట్టాలు, నిబంధనలకు పూర్తిగా కట్టుబడి ఉండాలని యూకే విదేశాంగ కార్యదర్శి జేమ్స్ క్లీవర్లీకి గట్టిగా తెలియజేశాం’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలియజేసిన్టటు ‘టైమ్స్ నౌ’ నివేదించింది. ఈ సమావేశం అనంతరం జైశంకర్ ట్వీట్ చేస్తూ.. ‘‘ఉదయం యూకే విదేశాంగ కార్యదర్శి జేమ్స్ క్లీవర్లీ తో ద్వైపాక్షిక సమావేశం మొదలైంది. మా మధ్య జరిగిన చివరి చర్చకు సంబంధించిన పురోగతిని సమీక్షించాం. ముఖ్యంగా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ ప్రారంభాన్ని గుర్తించాము.’’ అని పేర్కొన్నారు.

Scroll to load tweet…

గత నెలలో ఆదాయపు పన్ను శాఖ దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాలలో మారథాన్ సర్వే కార్యకలాపాలను నిర్వహించింది. 2002 గుజరాత్ అల్లర్లపై ప్రధాన మంత్రి నరేంద్రపై రెండు భాగాల డాక్యుమెంటరీ విడుదలైన తర్వాత బ్రిటిష్ బ్రాడ్‌కాస్టర్‌పై ఐటీ దాడులు జరిగాయి. అయితే ఈ దాడులపై బీబీసీ స్పందించింది. ‘‘ఆదాయపు పన్ను అధికారులు ప్రస్తుతం న్యూఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాలలో ఉన్నారు. వారికి మేము పూర్తిగా సహకరిస్తున్నాం. ఈ పరిస్థితి వీలైనంత త్వరగా పరిష్కారం అవుతుందని మేము ఆశిస్తున్నాము’’ అని బీబీసీ ట్వీట్ చేసింది.

మోడీపై వ్యాఖ్యలు .. అమెరికన్ బిలియనీర్‌ జార్జ్ సరోస్‌‌కు కేంద్రం షాక్, ఆ లైసెన్స్ రద్దు

భారత ప్రధానిపై తీసిన డాక్యుమెంటరీ వివాదాన్ని సృష్టించింది. భారతదేశంలో బీబీసీని నిషేధించాలని డిమాండ్ లు వినిపించాయి. ఈ బీబీసీ బీబీసీ డాక్యుమెంటరీకి సంబంధించిన లింక్‌లను షేర్ చేసే ట్విట్టర్ పోస్ట్‌లు, యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేయాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే యూకే ప్రభుత్వం బీబీసీని బహిరంగంగా సమర్థించింది. “మేము బీబీసీ కోసం 
BBC కోసం నిలబడతాము. ఆ సంస్థకు నిధులు సమకూరుస్తాం. బీబీసీ వరల్డ్ సర్వీస్ చాలా ముఖ్యమైనదని మేము భావిస్తున్నాం. బీబీసీకి ఆ సంపాదకీయ స్వేచ్ఛ ఉండాలని మేము కోరుకుంటున్నాము’’ అని మంగళవారం ‘‘భారతదేశంలోని BBC కార్యాలయాలపై దాడి’’ అనే హౌస్ ఆఫ్ కామన్స్ చర్చలో విదేశీ, కామన్వెల్త్, అభివృద్ధి వ్యవహారాల పార్లమెంటరీ అండర్ సెక్రటరీ డేవిడ్ రూట్లీ పేర్కొన్నారు.