ప్రధాని నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమెరికా వ్యాపారవేత్త జార్జ్ సరోస్‌కు కేంద్రం షాకిచ్చింది. ఆయనకు చెందిన సెంటర్ ఫర్ పాల్స్ రీసెర్చ్ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ రద్దు చేసింది.

భారత ప్రధాని నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమెరికా వ్యాపారవేత్త జార్జ్ సరోస్‌కు కేంద్రం షాకిచ్చింది. ఆయన సంస్థలపై చర్యలు చేపట్టింది. సోరస్ సంస్థలపై నిఘా పెట్టింది. సీపీఆర్‌కు సంబంధించిన ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ రద్దు చేసింది. అలాగే సెంటర్ ఫర్ పాల్స్ రీసెర్చ్ సంస్థకు వచ్చిన విదేశీ నిధులపై కేంద్రం ఆరా తీసింది. కొద్దిరోజుల క్రితం సీపీఆర్ ఆఫీసులపై ఐటీ దాడులు చేసింది. 

కాగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించడం, గౌతమ్ అదానీ కంపెనీలు స్టాక్ మార్కెట్‌ను ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాయని హిండెన్‌బర్గ్ ప్రచురించిన రిపోర్ట్ ఆధారంగా బిలియనీర్ ఫిలాంథ్రోపిస్ట్ జార్జ్ సోరోస్ కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌కు ముందు ఓ ప్రసంగంలో సోరోస్ మాట్లాడుతూ భారత ప్రభుత్వంపై విమర్శలు చేశాడు. అదానీ గ్రూప్ సంక్షోభం గురించి, ప్రధాని మోడీ గురించి వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ సన్నిహితులను పేర్కొన్నారు. విదేశీ మదుపరులకు,పార్లమెంటులో ప్రధాని మోడీ ఈ అవినీతి ఆరోపణలు, స్టాక్ మ్యానిపులేషన్ ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిందే అని అన్నారు. అదానీ అవినీతి ఆరోపణలు దేశ ప్రభుత్వంపై మోడీ పట్టును నీరుగారుస్తుందని తెలిపారు. అంతేకాదు, భారత్‌లో ప్రజాస్వామిక పునరుజ్జీవనానికి ఇది బీజం వేయొచ్చని చెప్పారు. 

ALso REad: జార్జ్ సోరోస్ ఎవరు? ప్రధాని మోడీ గురించి ఏమన్నాడు? ఈ వివాదానికి సంబంధించి టాప్ పాయింట్స్ ఇవే

92 ఏళ్ల జార్జ్ సోరోస్ ప్రపంచంలోనే సంపన్నుల్లో ఒకడు. ఉన్నత యూధు కుటుంబంలో జన్మించాడు. నాజీలు వచ్చేలోపు సోరోస్‌కు 17 ఏళ్లు ఉన్నప్పుడు ఆ కుటుంబం హంగరీని విడిచిపెట్టింది. 1947లో లండన్‌కు వచ్చారు. అక్కడే సోరోస్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఫిలాసఫీ చదివాడు. చదువుల తర్వాత లండన్ మెర్చంట్ బ్యాంక్ సింగర్ ఫ్రిడ్‌ల్యాండర్ బ్యాంకులో చేరాడు. 1956లో న్యూయార్క్‌కు వెళ్లాడు. అక్కడ యూరోపియన్ సెక్యూరిటీస్‌కు అనలిస్టుగా తొలుత చేశాడు.

1973లో ఓ హెడ్జ్ ఫండ్ పెట్టిన తర్వాత ఆర్థిక ప్రపంచంలో సోరోస్ తన ముద్ర వేశాడు. 1969 నుంచి 2011 దాకా క్లయింట్ మనీని మేనేజ్ చేశాడు. సోరోస్ బ్రిటీష్ పౌండ్‌ను షార్ట్ చేశాడు. తద్వార 1 బిలియన్ డాలర్లను సొమ్ము చేసుకున్నాడు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌ను బ్రేక్ చేసిన వ్యక్తిగా అపకీర్తి మూటగట్టుకున్నాడు. 

సోరోస్ నెట్‌వర్త్ 8.5 బిలియన్ డాలర్లు. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ వ్యవస్థాపకుడు. కోల్డ్ వార్ తర్వాత వీటిని చెకోస్లేవియా, పోలాండ్, రష్యా, యుగోస్లేవియాలోనూ స్థాపించాడు. ఈ శతాబ్ది ఆరంభంలో 70కి పైగా దేశాల్లో యాక్టివ్‌గా ఉన్నాడు. అతను పొలిటికల్‌గానూ యాక్టివ్‌గా ఉన్నాడు. బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్, జో బైడెన్‌లకు మద్దతునిచ్చాడు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టర్కీ అధ్యక్షుడు రెసీప్ తయ్యిప్ ఎర్డోగన్‌లకు వ్యతిరేకంగా మాట్లాడాడు.